జూలై 7,8,9 తేదీల్లో తానా మహాసభలు

ABN , First Publish Date - 2022-12-07T03:41:34+05:30 IST

వచ్చే ఏడాది జూలై 7,8,9 తేదీల్లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మహాసభలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి తెలిపారు.

జూలై 7,8,9 తేదీల్లో తానా మహాసభలు

ఖమ్మం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జూలై 7,8,9 తేదీల్లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మహాసభలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్య స్రవంతి వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 2న ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి వేడుకలు జనవరి 7న ముగుస్తాయి. వీటి పర్యవేక్షణలో భాగంగా తానా బృందం మంగళవారం ఖమ్మంలో పర్యటించింది. లకారం చెరువులో ఎన్‌ఆర్‌ఐల సహకారంతో రూ.4 కోట్లతో నిర్మించ తలపెట్టిన 45 అడుగుల శ్రీ కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ విగ్రహ పనులను పరిశీలించారు.

Updated Date - 2022-12-07T03:41:35+05:30 IST