విద్యార్థులు కష్టపడి చదవాలి
ABN , First Publish Date - 2022-12-07T23:54:09+05:30 IST
విద్యార్థులు కష్టపడి చదవాలని తానా, సామినేని ఫౌండేషన్ బాధ్యులు పిలుపునిచ్చారు.
మధిర రూరల్, డిసెంబరు 7: విద్యార్థులు కష్టపడి చదవాలని తానా, సామినేని ఫౌండేషన్ బాధ్యులు పిలుపునిచ్చారు. బుధవారం మధిర మండలం మాటూ రుపేటలో బుధవారం న్యాయవాది నెల్లూరి రవి అధ్యక్షతన జరిగిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తానా అధ్యక్షుడు లావు అంజ య్య చౌదరి, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, సామినేని సేవాసమితి నిర్వాహకులు సామినేని రవి చేతుల మీదుగా 36 మంది విద్యార్థినీ, విద్యార్థులకు సైకిళ్లు, నలుగురు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను ఈఅందజేశారు. అనంతరం తానా అధ్యక్షుడు అంజయ్యచౌదరి మాట్లాడుతూ మాతృదేశానికి సేవ చేయాలనే సంక ల్పంతో తానా పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో తానా సభ్యులు శృంగవరపు నిరంజన్, విశ్వనాథ్, వేమూరి సతీష్, సామినేని ఫౌండేషన్ అధ్యక్షుడు సామినేని నాగేశ్వరరావు, కిలారి ముద్దుకృష్ణ, ప్రముఖ వైద్యుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, నాయకులు మల్లాది వాసు, అన్నెం మోహన్‌రావు, మాదల రాంబాబు, చిలివేరు బుచ్చిరామ్, ధనిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.