రైతులకు నష్టం కలగకుండా సర్వే చేపట్టాలి

ABN , First Publish Date - 2022-10-15T05:08:14+05:30 IST

రైతులకు నష్టం కలగకుండా పోడు సర్వే నిర్వహించాలని కాంగ్రెస్‌ వైరా నియోజకవర్గ నాయకులు, ఎఫ్‌ఆర్‌సీ జిల్లా కమిటీ సభ్యుడు బానోతు బాలాజీనాయక్‌ కోరారు.

రైతులకు నష్టం కలగకుండా సర్వే చేపట్టాలి
అటవీ అధికారులతో మాట్లాడుతున్న బాలాజీ

కొణిజర్ల, అక్టోబరు14: రైతులకు నష్టం కలగకుండా పోడు సర్వే నిర్వహించాలని కాంగ్రెస్‌ వైరా నియోజకవర్గ నాయకులు, ఎఫ్‌ఆర్‌సీ జిల్లా కమిటీ సభ్యుడు బానోతు బాలాజీనాయక్‌ కోరారు. శుక్రవారం ఆయన మండలంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను పరిశీలించారు. సాలెబంజర వద్ద సర్వేను పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. సర్వే నిర్వహిస్తున్న ప్రదేశానికి ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి బాలాజి పరిశీలిం చారు. గిరిజన, గిరిజనేతరులందరికీ పోడు భూముల విషయంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్వేకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్‌ వైరా సెక్షన్‌ అధికారి రామ, బీట్‌ ఆఫీసర్‌ అనూష వివరించారు. కార్యక్రమంలో బాలాజీ, రైతులు, వైరా మునిసిపాలిటి కౌన్సిలర్‌ సురేష్‌ పాల్గొన్నారు. 

Read more