శిక్షణ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

ABN , First Publish Date - 2022-04-25T04:31:49+05:30 IST

సింగరేణి సంస్థలో జూనియర్‌ సబ్‌ ఓవర్సీస్‌ పోస్టుల భర్తీ కోసం ఆదివారం సింగరేణి డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు.

శిక్షణ పోస్టుల భర్తీకి రాత పరీక్ష
పరిశీలిస్తున్న అధికారులు

పర్యవేక్షించిన జీఎం (రిక్రూట్‌మెంట్‌) బసవయ్య

రుద్రంపూర్‌, (సింగరేణి), ఏప్రిల్‌ 24: సింగరేణి సంస్థలో జూనియర్‌ సబ్‌ ఓవర్సీస్‌ పోస్టుల భర్తీ కోసం ఆదివారం సింగరేణి డిగ్రీ కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. 16 పోస్టుల కోసం ఇంటర్నల్‌ పోస్టుల ఎంపిక కోసం సింగరేణి యాజమాన్యం 43మందికి హాలు టిక్కెట్లను జారీ చేయగా 42 మంది పరీక్షలకు హజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని సింగరేణి జీఎం (రిక్రుట్‌మెంట్‌ సెల్‌) బసవయ్య, విజిలెన్స్‌ జీఎం చం ద్రశేఖర్‌, ఐటీ జీఎం రాంకుమార్‌లు పర్యవేక్షించారు. ఈ సం దర్భంగా జీఎం బసవయ్య మాట్లాడుతూ పోస్టుల భర్తీ కోసం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని ఎలాంటి మానవ ప్ర మేయం లేకుండా పూర్తి కంప్యూటర్‌తో పరీక్షపత్రాలను తయారుచేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిం చడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-04-25T04:31:49+05:30 IST