మెరిసిన ఎర్ర బంగారం
ABN , First Publish Date - 2022-12-15T01:03:30+05:30 IST
మార్కెట్లో ఎర్రబంగారం మెరుస్తోంది. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో వానాకాలం (ఖరీ్ఫ)సీజనతేజా రకం మిర్చితో పాటు ఏసీ మిర్చికి డిమాండ్ పెరుగుతోంది.
ఖమ్మం మార్కెట్లో కొత్తమిర్చి క్వింటా ధర రూ.21,900
ఏసీ మిర్చి రూ.21,400
ఖమ్మం మార్కెట్, డిసెంబరు 14: మార్కెట్లో ఎర్రబంగారం మెరుస్తోంది. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో వానాకాలం (ఖరీ్ఫ)సీజనతేజా రకం మిర్చితో పాటు ఏసీ మిర్చికి డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో బుధవారం క్వింటాలు కొత్త సీజన తేజా రకం సాధారణ మిర్చి(నాన ఏసీ)ని క్వింటాలు రూ.21,900ల జెండాపాట ధరకు వ్యాపారులు కొనుగోలు చేయగా కోల్డ్స్టోరేజీలలో నిల్వ ఉన్న ఏసీ మిర్చిని క్వింటాలు రూ.21,400లకు కొనుగోలు చేశారు. కొత్త మిర్చిని మార్కెట్లో కొంత కాలంగా క్వింటాలు రూ.19,000ల నుంచి రూ.20,000ల వరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు మూడు రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ.1,500ల నుంచి రూ.2,000లు అదనంగా ధర పెట్టి కొనుగోలు చేయడం విశేషం. కొత్త మిర్చికి మార్కెట్లో అత్యధిక ధర పలకడం ఈ సీజనలో ఇదే ప్రథమం. ప్రస్తుతం మిర్చి పంట క్షేత్రాలలో నల్ల తామర పురుగు, వైరస్ లాంటి తెగుళ్లు వస్తున్న నేపథ్యంతో పంట దిగుబడి తగ్గుతుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖాధికారులు అంచనా వేస్తుండగా మార్కెట్లో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు మిర్చి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇక వచ్చే జనవరి నుంచి మిర్చి పంట మార్కెట్కు పోటెత్తనున్న నేపఽథ్యంలో ధర క్వింటాలుకు రూ.20,000లకు తగ్గకుండా ఉంటేనే గిట్టుబాటవుతుందని రైతులు పేర్కొం టున్నారు. మార్కెట్కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మిర్చితోపాటు, మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలనుంచి తేజా రకం మిర్చికి వస్తుంది. తేజా మిర్చికి ప్రధానంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ తదితర దేశాలలో డిమాండ్ ఉంటుంది. ఆయా దేశాలకు ఎగుమతులు ఎక్కువగా ఉంటే ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కోల్డ్స్టోరేజీలలో నిల్వ ఉన్న సుమారు 3లక్షల మిర్చి బస్తాలను అమ్మకానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను మార్కెట్ చైర్పర్సన డౌలే లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన కొంటెముక్కుల వెంకటేశ్వర్లు, సెక్రెటరీ రుధ్రాక్షి మల్లేశం, గేడ్ర్టూ సెక్రెటరీ బజారు తదితరులు సమీక్షిస్తున్నారు.