ఇరు జిల్లాల్లో ఏడు కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-03-05T07:50:34+05:30 IST

ఇరు జిల్లాల్లో ఏడు కరోనా కేసులు

ఇరు జిల్లాల్లో ఏడు కరోనా కేసులు

ఖమ్మం కలెక్టరేట్‌, మార్చి 4: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 1538 మందికి పరీక్షలు నిర్వ హించగా ఆరు, భద్రాద్రి జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు నమోదైంది. ఖమ్మం ప్రధా న ఆస్పత్రిలోని కొవిడ్‌వార్డులో శుక్రవారం ఎవరూ చేరలేదు.ఈ వార్డులో మొత్తం 320బెడ్లు ఉండగా నలుగురు చికిత్స పొందుతున్నారు. 316 బెడ్లు ఖాళీగా ఉన్నా యి. జనరల్‌ వ్యాక్సినేషన కూడా విస్తృతంగా నిర్వహిస్తోన్నట్లు డీఎం హెచవో తెలిపారు. మొదటిడోస్‌ కింద 91మందికి, రెండో డోస్‌ కింద 2704 మందికి, బూస్టర్‌డోస్‌ కింద 36మందికి టీకాలువేసినట్లు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. 

Read more