జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో పెనుబల్లి విద్యార్థికి ద్వితీయ స్థానం

ABN , First Publish Date - 2022-11-12T00:15:16+05:30 IST

పెనుబల్లికి చెందిన పెండ్ర వికాస్‌ 37వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు.

జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో పెనుబల్లి విద్యార్థికి ద్వితీయ స్థానం

పెనుబల్లి, నవంబరు 11: పెనుబల్లికి చెందిన పెండ్ర వికాస్‌ 37వ జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించాడు. దీంతో మండలంలో హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చారు. మండలంలోని మండాలపాడు గ్రామానికి చెందిన పెండ్ర రాంబాబు, విజయ దంపతుల కుమారుడు వికాస్‌ శుక్రవారం అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగిన అండర్‌-14 బాలుర విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించాడు. వికాస్‌ గతంలోనూ అనేక పతకాలను సాధించి ఖమ్మంజిల్లాకు పేరు తీసుకువచ్చాడు. సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ క్రాక్‌లైన్‌లో బంగారు పతకం, 60మీటర్ల పరుగుపందెంలో వెండి పతకాలు సాధించాడు. రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లోనూ రెండు బంగారు పతకాలను సాధించాడు. వరంగల్‌లో మొదటిసారి రాష్ట్రస్థాయి జూనియర్‌ చాంపియన్‌షి్‌ప పోటీల్లో వందమీటర్ల పరుగుపందెంలో వెండి పతకాన్ని సాధించాడు. సౌత్‌జోన్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించి అస్సాంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించటం పట్ల పెనుబల్లి మండలంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

Updated Date - 2022-11-12T00:15:23+05:30 IST