సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలి

ABN , First Publish Date - 2022-09-20T04:44:01+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.

సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉండాలి
ఎమ్మెల్యే సండ్రకు బతుకమ్మలతో స్వాగతం

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు

సత్తుపల్లి, సెప్టెంబరు 19: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఆయన సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి లబ్దిదారులకు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో పాటు అసరా పింఛన్ల లబ్ధి దారులకు మంజూరు పత్రాలు, పింఛన్‌ కార్డులు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో 45లక్షల మందికి పింఛన్లను ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుంద న్నారు. నియోజకవర్గంలో 40 వేల మందికి పింఛన్లు ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పేదరికమే గీటురాయిగా సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల పింఛన్లు మంజూరు కాలేదని అలాంటి వారికి మూడు నెలల్లో పింఛన్లు మంజూరు అయ్యేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రీన్‌ ఫీల్డు హైవే, సింగరేణి ఓపెన్‌ కాస్టు బొగ్గుగని భూ సేకరణలో సత్తుపల్లి నియోజకవర్గ రైతులకు సగటున ఎకరాకు రూ.25లక్షల పరిహారం ఇప్పించినట్లు తెలిపారు. చెక్కుల పంపిణి కోసం వచ్చిన ఎమ్మెల్యే సండ్రకు నారాయణపురం తదితర గ్రామాల్లో బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమావతి, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-20T04:44:01+05:30 IST