రెండోరోజూ అదే ఉత్సాహం

ABN , First Publish Date - 2022-12-10T01:13:56+05:30 IST

పోలీసుశాఖలో సబ్‌ఇనస్పెక్టర్‌, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో రెండోరోజు శుక్రవారం 798మంది అభ్యర్థులకుగాను 668మంది హాజరయ్యారని, ఇందులో 267మంది తుది పరీక్షకు అర్హత సాధించినట్టు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ తెలిపారు.

రెండోరోజూ అదే ఉత్సాహం

668మంది అభ్యర్థుల హాజరు

తుదిపరీక్షకు అర్హత సాధించిన 267మంది

ఖమ్మం క్రైం, డిసెంబరు 9: పోలీసుశాఖలో సబ్‌ఇనస్పెక్టర్‌, కానిస్టేబుల్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షల్లో రెండోరోజు శుక్రవారం 798మంది అభ్యర్థులకుగాను 668మంది హాజరయ్యారని, ఇందులో 267మంది తుది పరీక్షకు అర్హత సాధించినట్టు పోలీస్‌ కమిషనర్‌ విష్ణు వారియర్‌ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున సీపీ విష్ణు వారియర్‌ ఈవెంట్స్‌ జరిగే పరేడ్‌ గ్రౌండ్‌ వద్దకు చేరుకుని ఈవెంట్స్‌ను పరిశీలించారు. పోలీస్‌ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ప్రతీ అంశం ఆఽధునిక సాంకేతిక పరిజ్ఙానంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకు ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి ఈవెంట్‌ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే సీసీటీవీ ఫుటేజీ ద్వారా నివృత్తి చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నిర్ధేశించిన ఎత్తు కంటే ఒక్క సెంటిమీటర్‌ తక్కువ వచ్చిన అఽభ్యర్థులకు వారి విజ్ఞప్తి మేరకు రీమెజర్‌మెంట్‌ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-10T01:13:57+05:30 IST