అటవీ భూమి సేకరణలో నిబంధనలు అమలుచేయాలి

ABN , First Publish Date - 2022-12-07T00:22:24+05:30 IST

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి అటవీశాఖ నుంచి సేకరించే భూమి బదాలాయింపులో నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మోహనచంద్రవర్గేయస్‌ సూచించారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మహబూబాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మోహనచంద్రవర్గేయస్‌ మాట్లాడుతూ అటవీశాఖ భూసేకరణ విషయంలో ఉన్న కేసులను కూడా సత్వరం పరిష్కరించేలా చూడాలని, పెండింగ్‌ ఉంచొద్దని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో 14కేసులకు సంబంధించిన 95ప్రతిపా

అటవీ భూమి సేకరణలో నిబంధనలు అమలుచేయాలి

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్ట్‌ మోహనచంద్రవర్గేయస్‌

ఖమ్మంలో మూడు జిల్లాల అధికారులతో సమీక్ష

ఖమ్మం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి అటవీశాఖ నుంచి సేకరించే భూమి బదాలాయింపులో నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ మోహనచంద్రవర్గేయస్‌ సూచించారు. మంగళవారం ఖమ్మంలో ఆయన మహబూబాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మోహనచంద్రవర్గేయస్‌ మాట్లాడుతూ అటవీశాఖ భూసేకరణ విషయంలో ఉన్న కేసులను కూడా సత్వరం పరిష్కరించేలా చూడాలని, పెండింగ్‌ ఉంచొద్దని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో 14కేసులకు సంబంధించిన 95ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, అటవీభూమిని నిబంధనల మేరకే కేటాయింపులు జరపాలని ఆదేశాలిచ్చారు. రహదారుల విస్తరణ, అప్టికల్‌ ఫైబర్‌, మిషన భగీరథ, నక్సల్స్‌ ప్రభావిత అభివృద్ధి పనులు, ఇతర ప్రభుత్వ అవసరాలకు అటవీభూమిని నిబంధనలు పాటించాలన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతిపాదనలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌ బీమానాయక్‌, ఉమ్మడి జిల్లా డీఎఫ్వోలు సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌, రంజితనాయక్‌, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:22:26+05:30 IST