ఆర్టీసీ.. దసరా ఆదాయం రూ.కోటి53లక్షలు
ABN , First Publish Date - 2022-10-12T05:46:51+05:30 IST
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అదనపు బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ.1,53,84,926 ఆదాయం వచ్చినట్టు రీజనల్ మేనేజర్ ఎ.ప్రభులత తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు సెప్టెంబరు 24నుంచి అక్టోబ
ఖమ్మం ఖానాపురంహవేలి, అక్టోబరు 11: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ అదనపు బస్సుల ద్వారా ఆర్టీసీకి రూ.1,53,84,926 ఆదాయం వచ్చినట్టు రీజనల్ మేనేజర్ ఎ.ప్రభులత తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు సెప్టెంబరు 24నుంచి అక్టోబరు4వరకు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలనుంచి హైదరాబాదుకు అక్టోబరు 6నుంచి 10వరకు ప్రత్యేక బస్సులను నడిపింది. దీని ద్వారా ఈ ఆదాయం వచ్చినట్టు ఆమె తెలిపారు. ఖమ్మండిపో నుంచి 270బస్సులద్వారా 58,37,004 మంది, మధిర నుంచి 63బస్సుల ద్వారా రూ.13,21,528, సత్తుపల్లి నుంచి 103బస్సులద్వారా రూ.22,07,753, భద్రాచలం నుంచి 124బస్సుల ద్వారా రూ.34,71,998, కొత్తగూడెం నుంచి 83బస్సుల ద్వారా రూ.18,54,538, మణుగూరు నుంచి 26బస్సుల ద్వారా రూ.69,2105 ద్వారా ఈ ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.