ఐటీఐ అభ్యర్థులకు ఆర్టీసీ అప్రంటీస్ షిప్
ABN , First Publish Date - 2022-03-06T04:44:53+05:30 IST
ఐటీఐ, డీజిల్, మెకానికల్ ట్రేడ్ కోర్సులు పూర్తిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోలలో ఐటీఐ అప్రంటీష్‌షిప్ ట్రైనింగ్‌ను ఇస్తామని రీజనల్ మేనేజర్ సోలోమెన్ శనివారం ఒక ప్రకటనలో తెలపారు.
ఖమ్మంఖానాపురంహవేలి, మార్చి5: ఐటీఐ, డీజిల్, మెకానికల్ ట్రేడ్ కోర్సులు పూర్తిచేసిన ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్ధులకు టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోలలో ఐటీఐ అప్రంటీష్‌షిప్ ట్రైనింగ్‌ను ఇస్తామని రీజనల్ మేనేజర్ సోలోమెన్ శనివారం ఒక ప్రకటనలో తెలపారు. ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా టీఎస్‌ఆర్టీసీ ఖమ్మం వెబ్‌సైట్‌లో అర్హత వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.