ప్రయాణికులపై రౌండప్‌ భారం

ABN , First Publish Date - 2022-03-23T05:51:59+05:30 IST

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను పరిష్కరించే నెపంతో చార్జీలను పెంచారు. ఖమ్మం రీజియన్‌లోని అన్ని రూట్లలో గురువారం నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వచ్చాయి.

ప్రయాణికులపై రౌండప్‌ భారం

 ‘చిల్లర’ భారం పేరుతో ఆర్టీసీ చార్జీల పెంపు

సిటీబస్సులో కనీస చార్జీ రూ.15

ఖమ్మం ఖానాపురం హవేలీ, మార్చి22:  ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యను పరిష్కరించే నెపంతో చార్జీలను పెంచారు. ఖమ్మం రీజియన్‌లోని అన్ని రూట్లలో గురువారం నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన ఇంధన ధరల కారణంగా చార్జీల పెంపు తప్పనిసరి చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఈ ధరల పెంపుపై ప్రచారం లేకపోవడం గమనార్హం. ఖమ్మం రీయిజన్‌లో అన్ని రకాలు కలిపి ఆర్టీసీ బస్సులు 274 ఉండగా రోజుకు 1,38,340కి.మీలు ప్రయాణిస్తున్నాయి. అద్దె బస్సులు 282 ఉండగా 1,21,349కి.మీ ప్రయాణిస్తున్నాయి.

ధరలు పెరిగాయిలా..

ఖమ్మం జిల్లాలో పల్లె వెలుగు, సూపర్‌, డీలక్స్‌ బస్సులలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. రూ.13 పాత చార్జీ ఉంటే రూ.15, రూ.17 పాత చార్జీ ఉంటే రూ.20గా,  రూ.21 పాత చార్జీ ఉంటే రూ.25గా పెంచినట్లు తెలిసింది. అయితే ధరల రౌండప్‌ చేయడంతో చిల్లర ఇచ్చే సమయంలో సమస్య ఉండదని చెబుతున్న అధికారులు, రౌండప్‌ను తక్కువ ధరలకు కాకుండా హెచ్చు ధరలకే మొగ్గు చూపినట్లు సమాచారం. 

కొన్ని రూట్లలో చార్జీలు

ఆర్టీసీలో కనీస చార్జీ రూ.10 ఉండగా దాన్ని మార్చలేదు. పల్లె వెలుగు బస్సుల్లో చార్జీల పెంపుతో ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి మంచుకొండకు రూ.13 ఉండగా ప్రస్తుదం దాన్ని రూ.15చేశారు.  పండితాపురం రూ.17నుంచి రూ.20, లింగాల రూ.21 నుంచి రూ.25,  గాంధీనగర్‌ రూ.30 ఉండగా అలాగే ఉంది. శివాయిగూడెం రూ.10 ఉండగా మార్పు చేయలేదు. ఇల్లెందుకు రూ.42 ఉండగా దాన్ని రూ.45కు పెంచారు. పల్లిపాడు రూ.17 ఉండగా 20, కూసుమంచి రూ.21 నుంచి రూ25, జీళ్ల చెర్వు రూ17నుంచి రూ.20, ముదిగొండ రూ. 17నుంచి రూ.20కి చార్జీలు పెంచారు.

సిటీ బస్సుల్లో కనీస చార్జీ రూ.15

 ఖమ్మం నగరంలో సిటీ బస్సుల్లో ప్రారంభ నుంచి రూ.10 ఽచార్జీని అమలు చేశారు. ఎక్కడ ఎక్కి దిగినా కేవలం రూ. 10గానే ఉండేది. అయితే  ప్రస్తుతం ధరల పంచడంతో సీటీ బస్సుల్లో కనీస చార్జీ రూ. 15 వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కాల్వొడ్డు నుంచి రఘునాధ పాలెం గ్రామానికి రూ.20గా నిర్ణయించారు. ధరల పెంపుతో సిటీ బస్సులపై రోజుకు అదనంగా రూ. 50వేల ఆదాయం ఆర్టీసీ సమకూరనుంది.

డీజిల్‌ ధరలకారణంగానే చార్జీలు పెంచాల్సి వచ్చింది:

శంకరరావు, ఖమ్మం డిపో మేనేజర్‌

బల్క్‌గా కొనే వారికి కంపెనీలు డీజిల్‌ రేట్లు పెంచడంతో ప్రస్తుతం రూ.10 ఉన్న సిటీబస్సులు చార్జీలను రూ.15కు పెంచాల్సి వచ్చింది. దీంతోపాటు స్పేర్‌పార్ట్స్‌ రేట్లు అధిక మవడం, చిల్లర సమస్య అధికంగా ఉండడంతో కొన్నికొన్ని రూట్లలో చిల్లర సమస్య లేకుండా కొన్ని సవరణలు చేశాం. ప్రస్తుతం ఉన్న రేట్లు ప్రజలకు అందుబాటులో  ఉన్నాయి.

Read more