వాన నీటితో ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసం

ABN , First Publish Date - 2022-10-08T04:46:11+05:30 IST

రోజులతరబడి వర్షపునీరు నిలిచిపోతూ రోడ్డు మొత్తం ధ్వంసమవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారుల్లో కనీస చలనం లేకుండాపోయింది.

వాన నీటితో ఆర్‌అండ్‌బీ రోడ్డు ధ్వంసం
దాచాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిలిచిన వర్షపునీరు

వైరా, అక్టోబరు 7: రోజులతరబడి వర్షపునీరు నిలిచిపోతూ రోడ్డు మొత్తం ధ్వంసమవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారుల్లో కనీస చలనం లేకుండాపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో దాచాపురం-గన్నవరం క్రాస్‌రోడ్డు వద్ద మూలమలుపులో రోడ్డు మొత్తాన్ని ఆక్రమించి వర్షపునీరు నిల్చిపోయింది. ఐదే ళ్ల కిందట రోడ్డును అభివృద్ధి చేసిన సమయంలో రోడ్డు అడుగుభాగంలో పూ డిపోయి ఉన్న పైపుకల్వర్టును పునర్నిర్మించకపోవడంతో ప్రస్తుతం ఈ దుస్థితి నెలకొంది. ఈ మూలమలుపు వద్దనే ఒక పెట్రోల్‌బంకు ఏర్పాటుచేశారు. పెట్రోల్‌బంకు నిర్వాహకులు తమ స్థలంలో మట్టి ఎత్తుగా పోయడంతో కల్వర్టు లేక వర్షపునీరు రోడ్డుపై నిల్చిపోతుంది. ఇక్కడ ద్విచక్రవాహన చోదకులు మొదలుకొని అన్నివాహనాల వారు నీటిలోనుంచే రాకపోకలు కొనసాగించా ల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సమయంలో జారిపడుతూ గాయాలపాలవుతు న్నారు. సరిహద్దుల్లో అధ్వాన పరిస్థితి ఉండటంతో ఆర్‌అండ్‌బీ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాచాపురం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వేల్పుల జయరాజు, గూడూరు రామిశేషిరెడ్డి ఆర్‌అండ్‌బీ డీఈకి ఈ సమస్యపై పలుసార్లు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎంతో పటిష్టంగా ఉన్న రోడ్డు నెలలతరబడి వర్షపునీరు నిలిచి ధ్వంసమవుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదనే విమర్శలు విన్పిస్తోన్నాయి. ఇప్పటికె ౖనా ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకొని రోడ్డు అధ్వానంగా తయారుకా కుండా చూడాలనిప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-10-08T04:46:11+05:30 IST