‘దారి’కొచ్చేది ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-04-25T03:54:23+05:30 IST

అసలే ఆ రహదారులు అంతంతమాత్రంగా నిర్మించారు. నాణ్యతను నేతిబీర చందంగా మార్చారు.

‘దారి’కొచ్చేది ఎప్పుడో?
పెద్దవాగు ఉధృతికి కోతకు గురైన రాయణపేట రహదారి ఒడ్డు.. ఇది జరిగి ఏడాదవుతున్నా ఇంత వరకూ మరమ్మతులు చేయలేదు

గతేడాది వర్షాలకు నామరూపాలు కోల్పోయిన రహదారులు

గోతులు, మొనదేలిన రాళ్లతో మరింత అధ్వానం

మణుగూరు నుంచి దమ్మపేట వరకు ఇదే పరిస్థితి 

నరకం చూస్తున్న ప్రయాణికులు

మణుగూరు/ మణుగూరు రూరల్‌/ కరకగూడెం/ దమ్మపేట, ఏప్రిల్‌ 24: అసలే ఆ రహదారులు అంతంతమాత్రంగా నిర్మించారు. నాణ్యతను నేతిబీర చందంగా మార్చారు. పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేరు. దీనికి తోడు మిన్ను, మన్ను ఏకం అయ్యేలా గతేడాది వర్షాలు కురిశాయి. ఇంకేముంది రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. అడుగుకో గోతి, మొనదేలిన రాళ్లతో నరకానికి నకళ్లుగా మారాయి. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా అటు ప్రభుత్వం, ఇటు సంబంఽ దిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు న రకం చూస్తున్నారు. ఇది ఒక ప్రాంతానికే పరిమితం కాలే దు. ఇటు వైపున ఉన్న మణుగూరు నుంచి అటు వైపున ఉన్న దమ్మపేట వరకు ఇదే పరిస్థితి. ఆదివారం ఆంధ్రజ్యో తి ఆయా ప్రాంతాలను పరిశీలించగా ఒళ్లు జల‘దారి’ంచే వాస్తవాలు కళ్లకు గట్టాయి.

ప్రధాన రహదారి ఛిద్రం

మణుగూరు ఏటూరునాగారం ప్రధాన రహదారి పలు ప్రాంతాల్లో చెదిరిపోయి ప్రమాదాలకు నిలయంగా మారిం ది. మణుగూరు సీఎస్‌పీ ఇసుక బంకర్‌ దాటిన తర్వాత నుంచి ప్రధాన రహదారి చాలా వరకు ఛిద్రమైంది. దీంతో వాహనాల రాకపోకలు సాగించడం కష్టతరమవుతోంది. రామానుజారం చుక్కుడుగుంట ప్రాం తాల్లో పడ్డ గోతులు పొంచి ఉన్న ప్రమాదాలకు నిలువు టద్దంగా దర్శన మిస్తున్నాయి. నిత్యం బీటీపీఎస్‌కు బొగ్గు లారీలు, మణుగూరు నుంచి పినపాక మండలాలకు ఆ టోలు వేలాది సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు, బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ఈ ప్రధాన రహదారిపై జరుగుతుందోనన్న ఆందోళన ప్ర యాణికుల్లో నెలకొంది. 

రాయణపేట రహదారికి మోక్షం ఎన్నడు?

కరకగూడెం మండలంలోని చిరుమళ్ల నుంచి రాయణపేట, కౌలురు మీదుగా పినపాక మండలం పొట్లపల్లి నుంచి ఐలాపురం వరకు గతంలో రహదారి నిర్మించారు. చిరుమళ్ల నుంచి రాయణపేట వరకు ఐటీడీఏ నిధుల నుంచి మూడు సంవత్సరాల క్రితం బీటీ రహదారిని నిర్మించారు. 2020లో పెద్దవాగు ఉఽధృతికి కౌలురు పరిధిలో కిలో మీటరు మేర రహదారి కోతకుగురైంది. కానీ నేటికీ రహదారికి మరమ్మతులు చేయలేదు. ఈ రహదారి మీదుగా చిరుమళ్ల నుంచి ఏడూళ్లబయ్యారం, మణుగూరుకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడంతో ప్రయాణికులకు దురాభారం అవుతోంది.

నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు

మణుగూరు పట్టణంలో అంభేద్కర్‌ సెంటర్‌లో రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు నత్త నడకన సాగుతున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రధాన రహదారి విస్తరణలతో పాటు అంబేద్కర్‌ విగ్రహాం ముందు నూతనంగా నిర్మించే డివైడర్‌, గార్డెన్‌ పనులు మండకొడిగా సాగుతున్నాయి. ఇందుకోసం చేపట్టిన తవ్వకాలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. 11 రోజుల కిత్రం ఇక్కడి రోడ్డు విస్తరణ, డివైడర్ల కోసం త వ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు అగేం దుకు స్టాప్‌ ఉండటడంతో ప్రయాణికులు పడుతున్న బాధ లు వర్ణనాతీతంగా మారాయి. తవ్విన గుంతలు ప్రయా ణి కులను రోడ్డుపైనే నిల్చోబెడుతున్నాయి. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీతో ఉండే ఈ రోడ్డుపై బస్సుల కోసం నిలుచోవడం కష్టతరంగా మారింది. ఎప్పుడు ఏ వాహనం ఆదుపుతప్పి తమ మీదుకు దూసుకోస్తుందో తెలియని పరిస్థితి. అలాగే నిలుచున్న మెయిన్‌ రోడ్‌పై ఆదమరిచి ఓ అడుగు వెనక్కేస్తే కింద పడిపోవడం ఖాయం. ఇది ఇలా ఉంటే డివైడర్ల కోసం ఇసుక, కంకర కుప్పలను ప్రధాన రహదారిపై పోయడంతో రోడ్డు మరింత కుంచించుకుపోయింది. 

రహదారి కొట్టుకుపోయింది

గత ఏడాది జూన్‌ నెలలో కురిసిన భారీ వర్షాలకు దమ్మపేట మండలం రసూరిపల్లి-ఊట్లపల్లి ప్రధాన రాహదారి కోతకు గురైంది. దాదాపు ఏడాది అవుతున్నా మరమ్మ తులు చేయలేదు. చూసేందుకు రహదారి బాగానే కనిపిస్తున్నా కల్వర్టుతో పక్కన మట్టితో పాటు రహదారి కింద భాగం కోతకు గురైంది. దీంతో  రోడ్డు ఎప్పుడు కూలిపోతుందనని ప్రయాణికులు ఆందోళనల చెందుతున్నారు. భ యంభయంగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఎగువ ప్రాం తాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద రావటంతో కల్వర్టు చిన్నది కావటంతో రహదారిపై నుంచి వెళ్లడంతో కోతకు గురవుతోంది. 

ఆర్‌అండ్‌బీ ఏఈ ఏమంటున్నారంటే..

ఆర్‌అండ్‌బీ ఏఈ విద్యాసాగర్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా రసూరిపల్లి- ఊట్లపల్లి రహదారి మర్మతులకోసం ప్రతిపాదనలు పంపామని కాని నిధులు మంజూరు కాలేదన్నారు. రాసూరిపల్లి సమీపంలోని పొలాల పై నుంచి భారీగా వరద వస్తుండటంతో రహదారి కోతకు గురవుతోంది. నిధులు మంజూరైతే మర్మతులు చేపడతాం.

శాశ్వత మరమ్మతులు చేపట్టాలి

తోట రాజు, రాసూరిపల్లి సర్పంచ్‌

రాసూరిపల్లి- ఊట్లపల్లి రహదారి ప్రమాదకరంగా ఉంది.తాత్కాలికంగా మరమ్మతులు చేసి చేతులుదులుపు కుం టున్నారు. దీనివల్ల సమస్య పునరావృతమవుతోంది. ఆర్‌అండ్‌బీ అధికారులకు సమస్యను విన్నవించాం. రహ దా రిపై కల్వర్టు నిర్మిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లాం.


Updated Date - 2022-04-25T03:54:23+05:30 IST