కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను తిప్పకొట్టండి
ABN , First Publish Date - 2022-12-15T00:20:46+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపు నిచ్చారు.
ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు
కొత్తగూడెం టౌన్, డిసెంబరు 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపు నిచ్చారు. బుధవారం కొత్తగూడెంలోని ఊర్దూగడ్లో అఖిల భారత రైతు కూలీ సంఘం, ఏఐకేఎంఎస్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో ప్రారంభ ఉపన్యాసం చేశారు. రైతుకూలీలు, పేద కార్మికులు ఉపాధి కూలీలు కర్షకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యపట్టారు. 1947కు ముందు నుంచి 47 తర్వాత దేశంలో ఉత్పత్తి వ్యవస్థలో వస్తున్న పెట్టుబడిదారీ మార్పులను దృష్టిలో పెట్టుకొని అఖిలభారత రైతు కూలీ సంఘాన్ని, రైతులను వ్యవసాయ కార్మికులను వేరు వేరు సంఘాలుగా విభజించాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జనరల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇప్పటి నుంచి అఖిలభారత రైతుకూలీ సంఘం లో సంఘం పేరుతో కాకుండా అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘంగాను, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం గాను రాష్ట్రంలో పనిచేస్తాయన్నారు. ఈ కౌన్సిల్ తదితర తీర్మానాలను అమోదించడం జరిగిందన్నారు. స్వామినాధన్ సిపారసులను వర్తించి ఉత్పత్తి ఖర్చులకు 50శాతం జోడించి మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ చట్టం చేయాలని. రైతాంగం రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కౌన్సిల్‌కు గోకినపల్లి వెంకటేశ్వరరావు సాయం చిన్న చంద్రన్న, వి ప్రభాకర్ వ్యవహరించారు. కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా కెచ్చల రంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా గుమ్మడి నర్స య్య, కేజీ రమచంద్రన్ ప్ర సంగించారు.