అధైర్య పడొద్దు.. పట్టాలొస్తాయి

ABN , First Publish Date - 2022-01-22T05:21:55+05:30 IST

‘పోడు సాగు చేసుకుంటున్న రైతులు అధైర్యపడొద్దు. త్వరలోనే పట్టాలు వస్తాయి. అంతవరకు అటవీ అధికారులు పోడుభూముల జోలికి పోవద్దని’ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.

అధైర్య పడొద్దు.. పట్టాలొస్తాయి
పోడు పట్టాలు ఇప్పించాలని వినతి పత్రం అందజేస్తున్న మహిళలు

గిరిజనులకు ఎమ్మెల్యే రేగా కాంతారావు భరోసా

గుండాల మండలంలో విస్తృత పర్యటన

గుండాల, జనవరి 21: ‘పోడు సాగు చేసుకుంటున్న రైతులు అధైర్యపడొద్దు. త్వరలోనే పట్టాలు వస్తాయి. అంతవరకు అటవీ అధికారులు పోడుభూముల జోలికి పోవద్దని’ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఇంటింటికి కేసీఆర్‌, గడపగడపకు టీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జగ్గాయిగూడెం, మటంలంక, కన్నాయిగూడెం, లక్ష్మీపురం, గలభ, యాపలగడ్డ, పోతిరెడ్డిగూడెం, కోనవారిగూడెంలతో పాటు మండలం కేంద్రంలో ఆరు అంతర్గత రహదాలుకు రూ.75లక్షలు మంజూరు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు మంచినీరు, సాగునీరు, త్రీఫేజ్‌ విధ్యుత్‌, పోడుభూముల సమస్యలను విన్నవించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పోడు భములపై ప్రభుత్వం ఇప్పటికే సర్వే ప్రారంభించిదని త్వరలోనే పట్టాలు వస్తాయాని తెలిపారు. అప్పటివరకు అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు. మంజూరు చేసిన సీసీ రోడ్లను పిబ్రవరి నెలలో పూర్తి చేయాలని సంభందిత అధికారులను ఆధేశించారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ రంగు రమేష్‌, మిషన్‌ భగీరథ డీఈ పద్మావతి, ఎంపీడీఓ హజ్రత్‌ వళీ, పీఆర్‌ ఏఈ అఖిల్‌, ట్రాన్స్‌కో ఏఈ రవి, ఏపీఎం రవికుమార్‌, ఏపీఓ రవితేజ, సర్పంచ్‌లు మోహన్‌, సమ్మయ్య, నర్సింహరావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొగ్గెల రామయ్య, పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్‌, నాయకులు భవానీ శంకర్‌, వీరస్వామి, అబ్దుల్‌నభీ, సయ్యద్‌ అజ్జు, లింగయ్య, ఈసం సుధాకర్‌, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-22T05:21:55+05:30 IST