రామయ్యకు వెండి ఊయల వితరణ
ABN , First Publish Date - 2022-03-06T04:36:06+05:30 IST
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి ఏపీలోని వైజాగ్‌కు చెందిన నున్నా చిన పుల్లారావు, శిరీష దంపతులు చెక్కమీద వెండి తొడుగుతో ఊయలను విరాళంగా అందజేశారు.
భద్రాచలం, మార్చి 5: భద్రాచలంలోని సీతారామచంద్రస్వామికి ఏపీలోని వైజాగ్‌కు చెందిన నున్నా చిన పుల్లారావు, శిరీష దంపతులు చెక్కమీద వెండి తొడుగుతో ఊయలను విరాళంగా అందజేశారు. సుమారు 75 కేజీల వెండితో రూ. ఐదు లక్షల విలువతో ఊయలను రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా దేవ స్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్‌కు లాంఛనంగా వారు ఊయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీనివాస్, కిషోర్, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు ఉన్నారు.