పెనుబల్లిలో కుండపోత వాన

ABN , First Publish Date - 2022-08-05T03:54:21+05:30 IST

అప్పటి దాకా ఆకాశం మాములుగానే ఉంది. క్షణాల్లోనే మేఘాలు ఆవరించాయి. చినుకులు మొదలయ్యాయి. వాన ప్రారంభమైంది.

పెనుబల్లిలో కుండపోత వాన
చెరువును తలపిస్తున్న వీఎంబంజర్‌ రింగ్‌సెంటర్‌

ప్రధాన రహదారులన్నీ జలమయం

పెనుబల్లి, ఆగస్టు 4: అప్పటి దాకా ఆకాశం మాములుగానే ఉంది. క్షణాల్లోనే మేఘాలు ఆవరించాయి. చినుకులు మొదలయ్యాయి. వాన ప్రారంభమైంది. కుండపోతలా కురిసింది. దీంతో జాతీయ, రాష్ట్రీయ రహదారుల కూడలి అయిన వీఎంబంజర్‌లో గురువారం మధ్యాహ్నం గంటపాటు కురిసిన వర్షానికి చెరువును తలపించాయి. రింగ్‌సెంటర్లో నీరు చేరింది. గురువారం మధ్యాహ్నం పెనుబల్లి, వీఎంబంజర్‌, రామచంద్రరావు బంజర్‌, కారాయిగూడెం, బయ్యన్నగూడెంలో భారీగా వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయం కాగా వీఎంబంజర్‌ ముత్యాలమ్మ దేవాలయంలోకి భారీగా వరదనీరు చేరింది.

Updated Date - 2022-08-05T03:54:21+05:30 IST