ఆకాశాన్నంటుతున్న ధరలు

ABN , First Publish Date - 2022-05-15T05:29:56+05:30 IST

మండుతున్న ఎండలతో పాటు కూరగాయలు, పండ్లతోపాటు చికెన, మటన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు పైపైకి పోతుండటంతో సామా

ఆకాశాన్నంటుతున్న ధరలు

టమాటో కేజీ రూ.80, చికెన కేజీ రూ.300

రుద్రంపూర్‌, (సింగరేణి), మే 14 మండుతున్న ఎండలతో పాటు కూరగాయలు, పండ్లతోపాటు చికెన, మటన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయల ధరలు పైపైకి పోతుండటంతో సామాన్యుడు కూరగాయలు కొనే పరిస్థితి లేదు. వేసవి సీజనలో దొరికే మామిడి పండ్లు మరింత పిరమయ్యాయి. డజన రూ.400నుంచి రూ.500పలుకుతుండటంతో సామాన్యుడు కొనే పరిస్థితులు కనిపించడం లేదు. వేసవిలో దిగుబడులు తగ్గడంతో టమాటా కేజీ రూ.80లకు పలుకుతోంది. వేసవిలో కోళ్ల పెంపకం తగ్గడంతో చికెన ధరలు మండిపోతున్నాయి. కేజీచికెన ధర రూ.300లు పలుకుతోంది. మటన కేజీ రూ.800 వరకు ఉంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, మటన, చికెన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తాము ఏం కొనలేని పరస్థితి ఉందని సామాన్యులు వాపోతున్నారు. ధరలు నియంత్రించేందుకు ప్రజలు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

Updated Date - 2022-05-15T05:29:56+05:30 IST