కొత్తగూడెం నుంచి పోటీచేస్తా: పోట్ల
ABN , First Publish Date - 2022-03-06T03:50:59+05:30 IST
రానున్న శాసనసభ ఎన్నికల్లో కొత్త గూడెం నియోజకవర్గం నుంచి అధిష్ఠాన వర్గం ఆదేశిస్తే... కాం గ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు ప్రకటించారు.
కొత్తగూడెం, మార్చి 5: రానున్న శాసనసభ ఎన్నికల్లో కొత్త గూడెం నియోజకవర్గం నుంచి అధిష్ఠాన వర్గం ఆదేశిస్తే... కాం గ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర రావు ప్రకటించారు. గతంలో సుజాతనగర్ నియోజకవర్గ పరి ధిలో ఉన్న గ్రామాల అభివృద్ధి కోసం శ్రమించానని గుర్తు చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని హేమ చంద్రాపురంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీ వీడి అధికార పార్టీలో చేరి కాంగ్రెస్‌కు ద్రోహం చేశారని ఆరోపించారు. కొత్తగూడెం నియో జకవర్గ ప్రజలతో తనతో 30 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అధిష్ఠాన వర్గం నుంచి తనకు సానుకూలమైన స్పందన వ స్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతోపాటు పోడు రైతులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అటవీ హక్కుల యాజమాన్య చట్టాన్ని తీసు కొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కు తుందన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టి సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు వివరించారు. ఇందుకు అవిశ్రాంతంగా పనిచేస్తానని పోట్ల నాగేశ్వరరావు ప్రకటిం చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాళోతు రాం దాస్ నాయక్, ఏనుగుల అర్జునరావు, మోత్కూరి ధర్మారావు, యల్లంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.