చెరువు.. కల్పతరువు!
ABN , First Publish Date - 2022-12-15T22:42:19+05:30 IST
జమలాపురం పేరు చెబితే ప్రసిద్ధ వేంకటేశ్వరస్వామి గుడి గుర్తుకు వస్తుంది. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి ఆ గుడి పక్కన ఉన్న చెరువు మనుసులో నిలిపోతుంది.
ఎర్రుపాలెం, డిసెంబరు 15: జమలాపురం పేరు చెబితే ప్రసిద్ధ వేంకటేశ్వరస్వామి గుడి గుర్తుకు వస్తుంది. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి ఆ గుడి పక్కన ఉన్న చెరువు మనుసులో నిలిపోతుంది. 300 ఎకరాలకు పైగా విస్తీర్ణం. అధికారికంగా 741 ఎకరాల ఆయకట్టు. అనధికారికంగా జమలాపురం, గంగగూడెం, త్రిపురారం, రేమిడిచర్ల, బంజర, కండ్రిక, తెల్లపాలెం, ఎర్రుపాలెం, పెద్దగోపారం, పెగళ్లపాడులో రెండు వేల ఎకరాలకు పైగా పొలాలకు సాగునీరందిస్తోందిజ నాగార్జునసాగర్ ఎడమకాలవ మూడవ జోన్ పరిధిలో ఉండడంతో సాగర్ నీరు చేరడంతో పొలాలకు బోర్లు లేకపోయినా రెండు పంటలకు నీరందిస్తుంది.
మిషన్ కాకతీయతో కొత్త రూపం
ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కృషితో రూ. ఐదు కోట్లతో చెరువుకట్టను పెంచారు. చెరువు చుట్టూ రిటైనింగ్ కాంక్రీట్ వాల్, పారాపెట్ వాల్ నిర్మిం చారు. ఇది పంటపొలాలు మునగకుండా, నీరు వృఽథాగా పోకుండా నిల్వ ఉండేందుకు దోహదపడింది. పర్యాటక ప్రాంతంగా వెలుగొందేందుకు భట్టి కృషిచేశారు. 2016లో మిసన్ కాకతీయ పథకం ద్వారా దాదాపుగా రూ. కోటితో పూడికతీశారు. దీంతో చెరవునీటి నిల్వ సామర్థ్యం 96.86 మిలియన్ క్యూబిక్ ఫీట్లకు పెరిగింది. నాలుగేళ్లుగా నిండా నీటితో చెరువు కళకళలాడుతోంది.
100కుపైగా మత్స్య కుటుంబాలకు ఆధారం
చెరువు కింద 100 మంది సభ్యులతో మత్య్సశాఖ ద్వారా గుర్తింపు పొందిన చేపల సొసైటీ ఉంది. ప్రతి ఏటా 70 వేల నుంచి లక్ష వరకు ప్రభుత్వం చేపపిల్లలు పంపిణీ చే స్తోంది. వాటితోపాటు ప్రైవేటుగా చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువులో వదులుతున్నారు. దాదాపుగా 50 నుంచి 60 టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. టన్నుకు రూ. ఎనభై వేల వరకు ధర పలుకుతోంది. జమలాపురం చెరు వు చేపలకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.