పల్లెప్రగతిలో క్రీడాప్రాంగణాలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

ఐదోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేలోగా అన్ని గ్రామాల్లో నిర్ధేశించిన లక్ష్యం మేరకు తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు.

పల్లెప్రగతిలో క్రీడాప్రాంగణాలను పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

 వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గౌతమ్‌

ఖమ్మం కలెక్టరేట్‌, జూన్‌7: ఐదోవిడత పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేలోగా అన్ని గ్రామాల్లో నిర్ధేశించిన లక్ష్యం మేరకు తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని ఎంపీడీవోలు, అధికారులతో  వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ క్రీడాప్రాంగణాలు హరితహరం, కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 589గ్రామ పంచాయతీల్లో 753 గ్రామాలు ఉన్నాయని 753 గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు కార్యాచరణ చేశామన్నారు. 535 చోట్ల స్థల కేటాయింపు జరగ్గా, 178 చోట్ల పనులు గ్రౌండిడ్‌ చేసినట్లు 46 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని 132 ప్రాంతాల్లో పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. 37 క్రీడాప్రాంగణాలు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. స్థల సేకరణ చేసిన చోట వెంటనే పనులు ప్రారంభించి తక్షణమే పూర్తి చేయాలన్నారు. రోజువారీ లక్ష ్యం నిర్ధేశించుకుని దీనికి అనుగుణంగా పనులను పూర్తిచేయాన్నారు. 8వ విడత చేపట్టే తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు 32లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు తెలిపారు. 18లక్షల మెక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కెనాల్‌ బండ్‌ ప్లాంటేషన్‌కు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో చనిపోయిన మెక్కల స్థానంలో కొత్తమెక్కలు నాటించాలన్నారు. వైకుంఠ ధామాలను వినియోగంలోకి తీసుకు రావాలన్నారు. సెగ్రిగేషన్‌ షెడ్లలో ఎన్ని వినియోగంలో ఉన్నవీ, తడిపొడి చెత్త సేకరణ వర్మీకంపోసు్ట్‌ తయారీ అమ్మకం ద్వారా పంచాయతీకి ఆదాయం నివేధికలను తక్షణమే అందించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు ఎన్‌ మధుసూదన్‌, స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో హరిప్రసాద్‌, డీఆర్వో శిరీష తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-07T05:30:00+05:30 IST