మహిళా పథకాలతో చిత్రాలు
ABN , First Publish Date - 2022-03-06T04:38:32+05:30 IST
రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల చిత్రాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సత్తుపల్లి మునిసిపల్ కార్యాలయం ఆవరణలో శనివారం గీసిని ఈ చిత్రాలు పలువురిని ఆకట్టుకుకున్నాయి.
సత్తుపల్లి, మార్చి5: రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల చిత్రాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. సత్తుపల్లి మునిసిపల్ కార్యాలయం ఆవరణలో శనివారం గీసిని ఈ చిత్రాలు పలువురిని ఆకట్టుకుకున్నాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ పథకాలను 130 అడుగుల విస్తీర్ణంలో రంగురంగులతో బొమ్మలు వేశారు. ముస్లిం, క్రిస్టియన్, హిందూ సాంప్రదాయం జంటల చిత్రాలు ఆకట్టుకున్నాయి. పెళ్లికుమార్తె, కుమారుడులను కేసీఆర్ ఆశీర్వదిస్తున్నట్లు గీచిన చిత్రం చూపరులను ఆకట్టుకుంది. రంగవల్లుల చుట్టూ మహిళలు కేసీఆర్ జయహో, థ్యాంక్యూ కేసీఆర్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిలుచున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మునిసిపల్ ప్రాంగణాన్ని బతుకమ్మ చీరెలతో లలంకరించారు.