శరీరదారుఢ్య పరీక్షలకు సర్వంసిద్ధం

ABN , First Publish Date - 2022-12-07T00:21:09+05:30 IST

పోలీస్‌ అభ్యర్థుల శరీరదారుఢ్య పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులకు ఖమ్మం పోలీస్‌పరేడ్‌ మైదానంలో ఈ పరీక్షలు నిర్వహించనుండగా ఇందుకు సంబంధించి మంగళవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ఏర్పాట్లు, ట్రయిల్‌రనను సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వారిలో 20,033మంది పురుషులు, 4700 మం

శరీరదారుఢ్య పరీక్షలకు సర్వంసిద్ధం
ట్రయల్ ను పరిశీలిస్తున్న సీపీ వారియర్

రేపటి నుంచి పోలీస్‌ఫిజికల్‌ టెస్టులు.. పూర్తయిన ట్రయల్‌రన

తొలిరోజు 600 మందికే పరీక్షలు

ఉమ్మడి జిల్లాలో 24,733మంది అభ్యర్థులు

ఏర్పాట్లను పరిశిలించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌

ఖమ్మం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ అభ్యర్థుల శరీరదారుఢ్య పరీక్షలకు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులకు ఖమ్మం పోలీస్‌పరేడ్‌ మైదానంలో ఈ పరీక్షలు నిర్వహించనుండగా ఇందుకు సంబంధించి మంగళవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ఈ ఏర్పాట్లు, ట్రయిల్‌రనను సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు ఉమ్మడి జిల్లా నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వారిలో 20,033మంది పురుషులు, 4700 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌ కార్డుతో రావాలని వారికి తొలుత పోలీసు ప్రధాన కార్యాలయ సమీపంలోని శివాలయం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్‌ సిబ్బంది టోకెన నెంబరు ఇచ్చి పోలీసు కల్యాణమండపంలోకి అనుమతిస్తారన్నారు. 50మంది అభ్యర్థులను ఇద్దరు రన్నర్స్‌ (కానిస్టేబుళ్లు) మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌ వద్దకు తీసుకువెళ్తారని తెలిపారు. అక్కడ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, బయెమెట్రిక్‌ ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం ప్రతీ అభ్యర్థికి చేతికి చిప్‌తో కూడిన రిస్ట్‌ బ్యాండ్‌, డిజిటల్‌ చిప్‌తో కూడిన ఆర్‌ఎఫ్‌ఐడీ బ్యాండ్లను అంటిస్తారన్నారు. అనంతరం పరుగు పరీక్ష పూర్తిచేసిన వారికి ఎత్తు కొలిచి.. నిర్ణీత ఎత్తు ఉన్నవారికి లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ పోటీలకు అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు ప్రతీ ఈవెంట్‌లోనూ అర్హత సాధించాలన్నారు. ఈవెంట్‌ వద్ద ఏసీపీ స్థాయి అధికారితోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అయితే ఆ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు సంబంధించి తొలిరోజు 600మందిని మాత్రమే అనుమతించనుండగా.. ఆ మరుసటి రోజు 800 మందిని ఆ తర్వాత 1300 మంది చొప్పున అభ్యర్థులకు శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్‌ బోర్డు కేటాయించిన తేదీలలో మాత్రమే హాజరయ్యేలా సమయం పాటిస్తూ అనుమతి పత్రం లేదా సమాచార లేఖ, ధ్రువపత్రాలు, పార్ట్‌-2 అప్లికేషన, సెల్ఫ్‌ అటెస్టెడ్‌ ఫొటో కాపీలను సమర్పించాలన్నారు. సీపీ వెంట అడిషనల్‌ డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ సుభాష్‌ చంద్రబోస్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ కుమారస్వామి, ఏఎస్పీ ఆకాంక్ష్‌ యాదవ్‌, ఏసీపీలు ప్రసన్నకుమార్‌, రవి, ఆర్‌ఐలు రవి, శ్రీనివాస్‌, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అశోక్‌కుమార్‌, సత్యనారాయణరెడ్డి, యూనిట్‌ డాక్టర్‌ జితేంద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:21:11+05:30 IST