ప్రజలకు కేసీఆర్‌పై నమ్మకం లేదు

ABN , First Publish Date - 2022-06-08T05:24:57+05:30 IST

ప్రజలకు కేసీఆర్‌పై నమ్మకం లేదు

ప్రజలకు కేసీఆర్‌పై నమ్మకం లేదు
కరకగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ముగిసిన బహుజన రాజ్యాధికారయాత్ర 

కరకగూడెం, జూన్‌ 7: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్‌ పాలనపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆయన చేపట్టిన బహుజన రాజ్యాధికారయాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జరిగింది. 86రోజులపాటు సాగిన ఆయన యాత్ర కరకగూడెం మండలంలో మంగళవారంతో ముగించారు. ఈ సందర్భంగా బంగారుగూడెం గ్రామంలో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం అనేక హామీలు ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక భద్రాద్రి ఏజెన్సీకి వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి పోడు రైతులకు పట్టాలు ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి హరితహారం పేరుతో పోడు భూములను లాక్కుని పోడు రైతులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు. హామీలను మరిచిన కేసీఆర్‌ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చర్మగీతం పడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాగవతం సతీష్‌, నైనరాపు నాగేశ్వరావు, ఇర్ప రవికుమార్‌, బిలపాటి సంపత్‌, పూనెం నరేష్‌, బూరుగుల కరుణకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more