నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-01-23T22:06:26+05:30 IST

పాల్వంచ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాల్వంచలో ఘనంగా నివాళులర్పించారు.

నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

పాల్వంచ: అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాల్వంచలో ఘనంగా నివాళులర్పించారు. వనమా కాలనీలోని జనతా ఫౌండేషన్ కార్యాలయంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సోమరాజు దొర చేతుల మీదుగా రోగులకు పాలు, పండ్లు ,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సోమరాజు దొర మాట్లాడుతూ దేశానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. అనంతరం పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండల రావు మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె అహ్మద్, జనతా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఏవి రాఘవ, సంఘం సభ్యులు సయ్యద్ అక్బర్, జే స్టాలిన్, ఎమ్‌డీ యూసుఫ్, ఎమ్‌డీ అన్వర్, ఎమ్‌డీ సాదత్ అలీ, ఎస్‌డీ అంజద్, జీ వేలాద్రి, ఎమ్‌డీ ఆసిఫ్, ఓం ప్రకాష్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T22:06:26+05:30 IST