రేపటినుంచి స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఎంపికలు

ABN , First Publish Date - 2022-02-23T05:55:24+05:30 IST

హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ల్లోని స్పోర్ట్స్‌ స్కూల్స్‌ళ్లల్లో 4,5 తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీల్లో నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో పరంధామరెడ్డి తెలిపారు.

రేపటినుంచి స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు ఎంపికలు

ఖమ్మంస్పోర్ట్స్‌, ఫిబ్రవరి 22: హకీంపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ల్లోని స్పోర్ట్స్‌ స్కూల్స్‌ళ్లల్లో 4,5 తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24, 25 తేదీల్లో నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో పరంధామరెడ్డి తెలిపారు. మండల స్థాయిలో ఎంపికలలో పాల్గోనని క్రీడాకారులు సైతం డైరెక్టుగా జిల్లా స్ధాయి ఎంపికల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికల్లో ప్రతిభ చూపిన 20మంది బాలురు, 20 మంది బాలికలను మార్చి 7, 8 తేదీలలో రాష్ట్ర స్ధాయిలో జరిగే ఎంపికలకు పంపుతామని తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికల్లో పాల్గొనే 8- 9 సంవత్సరాల క్రీడాకారులు  31-08-2012 నుంచి 31-08-2013 లోపు జన్మించి ఉండాలని, 5వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికల్లో పాల్గోనే క్రీడాకారులు 9-10 సంవత్సరాల క్రీడాకారులు  31-08-2011 నుంచి 31-08-2012 లోపు జన్మించి ఉండాలని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రంతో పాటు, ఆధార్‌, 10 లేటెస్ట్‌ పాస్‌ పోర్ట్‌ ఫోటోలు, కుల ధ్రువీకరణ, 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌తో ఉదయం 9 గంటలకల్లా స్టేడియానికి చేరుకోవాలని కోరారు. ఎంపికల్లో క్రీడాకారులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ప్లైయింగ్‌ స్టార్ట్‌, స్టాండింగ్‌ బోర్డ్‌ జంప్‌, 800 మీటర్ల పరుగు పోటీ, వెర్టికల్‌ జంప్‌, 6‘10 మీటర్ల షటిల్‌ రన్‌,మెడిసిన్‌ బాల్‌ జంప్‌, ఫ్లెక్సిబిలిటీ, మెడికల్‌ విభాగాలలో టెస్టులు ఉంటాయని తెలిపారు.  

Read more