మెరుగైన పౌరసేవలకే నూతన భవనం

ABN , First Publish Date - 2022-03-05T07:44:44+05:30 IST

మెరుగైన పౌరసేవలకే నూతన భవనం

మెరుగైన పౌరసేవలకే నూతన భవనం
నగరపాలకసంస్థ నూతనభవన నిర్మాణాన్ని పరిశీలించి, సూచనలు చేస్తున్న మంత్రి పువ్వాడ

త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా కార్పొరేషన్‌ బిల్డింగ్‌ ప్రారంభం

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌  8 నిర్మాణ పనుల పరిశీలన

ఖమ్మం కార్పొరేషన్‌, మార్చి 4: నగరప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించేందుకు అత్యాధునిక వసతులతో నగరపాలక సంస్థ నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ముగింపు దశకు వచ్చిన కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. సుమారు 60వేల చదరపు అడుగుల్లో సువిశాలంగా నిర్మి స్తున్న ఈ కార్యాలయ మిగులు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశిం చారు. నూతన కార్యాలయంలో రిసెప్షన కౌంటర్‌, మీసేవా, ఇంజనీరింగ్‌ విభాగం, కౌన్సిల్‌హాల్‌, లిఫ్ట్‌ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నామని, పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, కార్యాలయానికి వచ్చే పౌరుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కొత్త కార్యాలయంలో 150 మంది కూర్చొనేలా విశాలమైన మందిరం, డ్యూయల్‌ కుషన సీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి వెంట మేయర్‌ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆదర్శ్‌సురభి, ఏఎంసీ ఛైర్మన లక్ష్మీప్రసన్న, నగర పాలక సంస్థ ఎస్‌ఈ ఆంజనేయ ప్రసాద్‌, ఈఈ కృష్ణాలాల్‌, డీఈ రంగారావు తదితరులున్నారు. 

Updated Date - 2022-03-05T07:44:44+05:30 IST