మునుగోడు ప్రచారానికి మంత్రి, ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2022-10-07T06:28:40+05:30 IST
మునుగోడు ప్రచారానికి మంత్రి, ఎమ్మెల్సీ
ఖమ్మం కార్పొరేషన, అక్టోబరు 6: వచ్చేనెల 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని కొరటికల్, దుబ్బకాల్వ గ్రామాలకు మంత్రి పువ్వాడ, కొంపల్లి, కల్వకుంట్ల గ్రామాలకు తాతా మధుసూదన ఇనఛార్జ్‌లుగా నియమితులయ్యారు. ఆ మేరకు మంత్రి, ఎమ్మెల్సీ తమకు కేటాయించిన గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం చేస్తారు.