పోషకాహారలోపం.. పోతున్న ప్రాణం
ABN , First Publish Date - 2022-09-05T07:16:19+05:30 IST
పోషకాహారలోపం.. పోతున్న ప్రాణం
ఏజెన్సీ వాసులను వెంటాడుతున్న సమస్య
ఇంకా సరైన ఆహారం అందని చిన్నారులెందరో
భద్రాద్రిలో ఇప్పటి వరకు 1,800మందికి చికిత్స
భద్రాచలం, సెప్టెంబరు 4: భద్రాచలం ఏజెన్సీలోని చిన్నారులను పోషకాహార లోపం ఇంకా వెంటాడుతోంది. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బుద్దిమాంద్యం, ఎదుగుదల లేకపోవడం, రక్తహీనతతో బాధపడుతుండటంతో తరచూ ఇనఫెక్షన్లకు గురవుతున్నారు. ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ, ఛత్తీ్‌సగఢ్, ఒడిశా రాషా్ట్రల సరిహద్దులకు చెందిన వారు అధికంగా ఉంటున్నారని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం పోషకాహారలోపంతో బాధపడుతున్న వారి సంఖ్య తగ్గినా ఇంకా ఆ సమస్య ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఛత్తీ్‌సగఢ్, ఒడిశా తదితర రాషా్ట్రల నుంచి వలస వచ్చిన చిన్నారుల్లో పోషకాహార లోపాలు కనిపిస్తున్నాయి.అధికారిక లెక్కల ప్రకారమే 2021 సెప్టెంబరు నాటికి భద్రాద్రి జిల్లాలో 1,888 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించగా ప్రస్తుతం ఆ సంఖ్య 797ఉంది. అలాగే బరువు తక్కువ కలిగిన చిన్నారులు 2021 సెప్టెంబరులో 1,352 మంది ఉండగా ప్రస్తుతం 831 మంది ఉన్నారు.
భద్రాద్రిలో ఇప్పటి వరకు 1,800 మందికి చికిత్స
భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాల పోషకాహార పునరావాస కేంద్రంలో ఇప్పటివరకు 1,800మంది చిన్నారులకు చికిత్స అందించారు. 2012 ఆగస్టు 8న ఈ కేంద్రాన్ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పునరావాస కేంద్రం పదిబెడ్లతో మంజూరు కాగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి 15రోజులపాటు ఇక్కడ చికిత్స అందిస్తారు. ఆరునెలల నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఇక్కడ చికిత్స అందిస్తారు. ప్రధానంగా అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, ముల్కలపల్లి, చర్ల, దుమ్ముగూడెం మండలాల నుంచి పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు వస్తుంటారు. ఈ సమయంలో చిన్నారులకు పల్లీలు, పాలపొడి, చెక్కర, కొబ్బరి నూనెలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఇస్తారు. అలాగే సేమియా పా యసం, బెల్లం రాగిజావ, కిచిడి, నువ్వుల లడ్డూ, మొలకలతో పాయసం, పాలు, పండ్ల పదార్థాలు, అటుకులు, మరమరాల లడ్డూ, పూహ తయారు చేసి ఇవ్వడం వల్ల వారిలో లోపం తొలగి ఆరోగ్యవంతులుగా అవుతారని వైద్యాదికారులు పేర్కొంటున్నారు. వీటిలో ప్రొటీన, ఐరన కార్బోహైడ్రేడ్, మెగ్నీషియం, కాల్షియం ఉంటాయని తెలిపారు. ఈ కేంద్రంలో 15రోజులపాటు తమపిల్లలతో ఉన్నందుకుగాను తల్లికి రూ.1,500 ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. ఈ 15రోజుల పాటు తల్లికి గుడ్డు, అరటిపండు, సాంబారు, పెరుగుతో కూడిన పోషకాహారా న్ని అందించడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో బొమ్మలు, కథ లు చిన్నారులకు చెప్పడం, తల్లులకు వంటలు నేర్పడం జరుగుతోంది. చిన్నారులకు చికిత్స అందించే సమయంలో వైద్య పరీక్షలు, మందులు అన్ని ఉచితంగానే ఉంటుందని వారు తెలిపారు. ఇక్కడ ప్రస్తుతం ఒక వైద్యాధికారిణి, న్యూట్రిషియన కౌన్సిలర్, ఒక వంట మనిషి ఉన్నారు. కాగా గత కొన్నేళ్లుగా ముగ్గురు స్టాఫ్‌నర్సులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ కేంద్రానికి నెలకు పది నుంచి 15మంది చిన్నారులు వైద్య చికిత్స కోసం వస్తుంటారు.