సినీ నటుడు కృష్ణకు అభిమానుల నివాళులు

ABN , First Publish Date - 2022-11-27T22:52:19+05:30 IST

ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని శివరామ కృష్ణకు మండల పరిధిలో గల పేరువం చలో అభిమానులు నివాళులర్పించారు.

సినీ నటుడు కృష్ణకు అభిమానుల నివాళులు
కృష్ణ చిత్రపటానికి అభిమానుల నివాళులు

కల్లూరు, నవంబరు27: ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని శివరామ కృష్ణకు మండల పరిధిలో గల పేరువం చలో అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కృష్ణ సంతాప సభలో అభిమా నులు రాయల నాగేశ్వరరావు ఆధ్వర్యం లో కృష్ణ చిత్రపటానికి పలువురు అభి మానులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు మాట్లాడుతూ సీనీ రం గంలో 360 చిత్రాలలో నటించిన సూపర్‌స్టార్‌ కృష్ణ ఎందరో మనస్సుల్లో చిరస్థాయిగా నిలి చారన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. మండల పరిధిలోని పెద్దకోరుకొండిలోనూ అభిమానులు నివాళులర్పించారు. కార్యక్రమంలో అభిమానులు రాయల వెంకటేశ్వరరావు, వై ధర్మేందర్‌, కీసరి కృష్ణరెడ్డి, ఇనపాల వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T22:52:20+05:30 IST