రేపు జేవీఆర్ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం
ABN , First Publish Date - 2022-10-08T04:30:14+05:30 IST
జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో 1976-79సంవత్సరానికి చెందిన మొదటి బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు.
ముఖ్యాతిథిగా హాజరుకానున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి
సత్తుపల్లి, అక్టోబర్ 7: జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో 1976-79సంవత్సరానికి చెందిన మొదటి బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య రానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రోగ్రామ్ కన్వీనర్ దారా కృష్ణారావు తెలిపారు.
జలగానికి నివాళులతో ప్రారంభం
జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ ప్రాంతంలో ప్రధానంగా విద్యాబుద్దులు నేర్పింది. 1976-79లో చదివిన పూర్వ విద్యార్ధులు ఏర్పాటుచేసే అపూర్వ సమ్మేళనం రెండు రోజుల పాటు సాగనుంది. తొలుత కళాశాల ఏర్పాటుకు అహర్నిసలు శ్రమించిన మాజీ ముఖ్యమంత్రి సర్ధార్ జలగం వెంగళరావు కాంస్య విగ్రహానికి (జేవీఆర్ పార్క్ వద్ద) నివాళులుతో శనివారం ప్రారంభం కానుంది. ఆదివారం వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యే పద్మశ్రీ వనజీవి రామయ్య ఉపన్యాసం, అదేవిధంగా జలగం, ఉడతనేని, చిట్లూరి కుటుంబ సభ్యులకు సన్మానం, గిరిజా మనోహరబాయితో రాళ్లబండి కవితాప్రసాద్ స్మారక ఉపన్యాసం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి సన్మానోత్సవం ఉంటుంది. కళాశాలలో దివంగత అధ్యాపకులు, మిత్రులు, సిబ్బందికి నివాళులర్పించనున్నట్లు కో-కన్వీనర్లు ఏ.శేషగిరిరావు, బీ.మురళీధర్‌రెడ్డి తెలిపారు.