ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-03-06T04:42:16+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం, కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తోన్న టీడీపీ నాయకులు

 నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

 కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ  ధర్నా

ఖమ్మంకలెక్టరేట్‌, మార్చి5: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ వాసిరెడ్డి రామనాధం, కూరపాటి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. 2018 ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా నిరుద్యోగ భృతిని వెంటనే అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా ఏలాంటి ఉద్యోగ ప్రకటనలు చేయలేదని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడు కొంటోందని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెప్పి అధికారంలోకి వచి ్చన తరువాత కాలయాపన చేస్తోందన్నారు. కేసీఆర్‌ పాలనకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ఈ దర్నాలో ప్లకార్డులను చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌కు అందచేశారు. ఈ కార్యక్రమంలో కేతినేని హరీష్‌, గుత్తా సీతయ్య, సానబోయిన శ్రీనివాస్‌గౌడ్‌, నాగండ్ల మురళి, వంగాల రామకోటి, మల్లాది హనుమంతరావు, తాతా సుధాకర్‌రావు, రావుట్ల సత్యనారాయణ, పోట్లపల్లి కోటేశ్వరరావు, విజయ్‌, లక్ష్మణ్‌, వెంకన్న,తాళ్లూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-03-06T04:42:16+05:30 IST