నేడు భద్రాద్రి జిల్లాకు ‘ఇరిగేషన్‌’ ఉన్నతాధికారులు

ABN , First Publish Date - 2022-01-22T05:34:50+05:30 IST

నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రానుంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూ

నేడు భద్రాద్రి జిల్లాకు ‘ఇరిగేషన్‌’ ఉన్నతాధికారులు

కుమ్మరిగూడెం వద్ద సీతమ్మ సాగర్‌ పనుల పరిశీలనకు ఏర్పాట్లు

అశ్వాపురం, జనవరి 21 : నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రానుంది. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్టకు సమాంతరంగా నిర్మిస్తున్న సీతమ్మ బ్యారేజ్‌ పనులను పరిశీలించనున్నారు. ఈమేరకు శుక్రవారం  వారి పర్యటన షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌కుమార్‌, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఈఎన్‌సీ సి.మురళీధర్‌, ఎల్‌అండ్‌టీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుబ్రమణ్యన్‌, సంస్థప్రతినిధులు ఆర్‌.అబలాగన్‌, సురేష్‌కుమార్‌ పనులను సందర్శించనున్నారు. ఉన్నతాధికారుల పర్యటనకు క్షేత్ర స్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆనకట్టకు సమీపంలో ప్రత్యేక హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు.  శనివారం మధ్యాహ్నం అమ్మగారిపల్లి హెలీప్యాడ్‌కు చేరుకున్న అనంతరం అధికారుల బృందం సీతమ్మబ్యారేజ్‌ పనులను ఎల్‌అండ్‌టీ ఇంజనీర్ల బృందంతో కలసి పరిశీలించనుంది.  భోజన విరామ అనంతరం  అమ్మగారిపల్లి సమీపంలోని ఎల్‌అండ్‌టీ అతిఽథి గృహంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని స్థాయిల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం సాయంత్రం 4గంటలకు హైదరాబాద్‌ తిరుగుపయనమవుతారు. 

Updated Date - 2022-01-22T05:34:50+05:30 IST