ఆకట్టుకుంటున్న ఇగ్నైట్‌ ఫెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-07T23:50:16+05:30 IST

సుదిమళ్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో రెండురోజులుగా జరుగుతున్న ఖమ్మం రీజియన్‌ స్థాయి ఇగ్నైట్‌ ఫెస్ట్‌ కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న ఇగ్నైట్‌ ఫెస్ట్‌
నృత్యాలు చేస్తున్న విద్యార్ధినిలు

ఇల్లెందురూరల్‌,డిసెంబరు7: సుదిమళ్ల గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో రెండురోజులుగా జరుగుతున్న ఖమ్మం రీజియన్‌ స్థాయి ఇగ్నైట్‌ ఫెస్ట్‌ కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తున్నాయి. విద్యార్ధులు తమ ప్రతిభాపాఠవాలు ప్రదర్శించడం లో పోటీ పడుతున్నారు. బుధవారం ఖమ్మం రీజియన్‌లోని 14 గురుకుల పాఠశా లలు, కళాశాలల విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఖమ్మం రీజియన్‌ గురుకులల ఆర్‌సీవో డేవిడ్‌రాజ్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల ఆర్‌సీవో సంపత్‌కుమార్‌, సుదిమళ్ల ప్రిన్సిపల్‌ ఆరుణకుమారి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:50:17+05:30 IST