వద్దిరాజు అను నేను!

ABN , First Publish Date - 2022-05-31T04:26:43+05:30 IST

వద్దిరాజు అను నేను!

వద్దిరాజు అను నేను!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో సతీసమేతంగా వద్దిరాజు రవిచంద్ర

రాజ్యసభ సభ్యుడిగా రవిచంద్ర ప్రమాణ స్వీకారం  

రాష్ట్రంనుంచి తరలివెళ్లిన టీఆర్‌ఎస్‌ నేతలు 

ఖమ్మం, మే 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంట్‌లో ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రవిచంద్ర చేత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేయించారు. రవిచంద్రను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపికచేయగా ఏకగీవ్రంగా ఆయన ఎన్నికయ్యారు. వద్దిరాజు ప్రమాణస్వీకారానికి ఖమ్మం జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ప్రజాప్రతినరిధులు ఢిల్లీ తరలి వెళ్లారు. టీఆర్‌ఎస్‌ లోక్‌సభ నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ పక్షనేత కే.కేశవరావుతోపాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి యర్రబల్లి దయాకరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రులు సత్యవతిరాఽథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాళోతు కవిత, పలువురు పార్లమెంట్‌ సభ్యులు రవిచంద్ర ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, బండా ప్రకాష్‌, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి శంకర్‌నాయక్‌, పెద్దిసుదర్శనరెడ్డి, నన్నపనేని నరేందర్‌, మేయర్‌ గుండు సుధారాణి, జడ్పీచైర్మన లింగాల కమల్‌రాజ్‌, డీసీసీబీ చైర్మన కూరాకుల నాగభూషణం, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్‌, జిల్లా రైతుసమన్వయసమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఉమ్మడిజిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్లు కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగాల రాజేందర్‌, విద్యాసంస్థల అధినేత పారుపల్లి ఉషాకిరణ్‌తోపాటు జిల్లాకు చెందిన టీఆర్‌ఎ్‌సనాయకులు, జర్నలిస్టు సంఘాల నేతలు కె.రాంనారాయణ, ఆకుతోట ఆదినారాయణ తదితరులు వద్దిరాజును కలిసి అభినందనలు తెలిపారు. 

Updated Date - 2022-05-31T04:26:43+05:30 IST