కుమార్తెపై తండ్రి అత్యాచారయత్నం
ABN , First Publish Date - 2022-10-07T04:57:19+05:30 IST
మైనర్ అయిన కుమార్తెపై విచక్షణ మరిచిన ఓ తండ్రి అత్యాచారయత్నం చేయబోగా తల్లి అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు
సత్తుపల్లిరూరల్, అక్టోబరు 6 : మైనర్ అయిన కుమార్తెపై విచక్షణ మరిచిన ఓ తండ్రి అత్యాచారయత్నం చేయబోగా తల్లి అడ్డుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తుపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16ఏళ్ల యవసున్న ఓ బాలికపై సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె తండ్రి విచక్షణ మరిచి అత్యాచారం చేయబోయాడు. అదే సమయంలో బయటనుంచి ఇంట్లోకి వచ్చిన తల్లి అఘాయిత్యాన్ని గమనించి అడ్డుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి తల్లి గురువారం ఫిర్యాదు ఇవ్వడంతో నిందితుడైన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేశామని సత్తుపల్లి సీఐ కరుణాకర్ తెలిపారు.