పశువుల పంపిణీకి మరింత జాప్యం

ABN , First Publish Date - 2022-10-30T01:44:09+05:30 IST

దళితబంధు పథకం కింద గేదెలు, ఆవులు, పశువులు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. లంపిస్కిన(ముద్దచర్మ)వ్యాధి కారణంగా పశువుల రవాణాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలు సడలించకపోవడతో పశువుల రవాణా ఇతర రాష్ట్రాలనుంచి జరగడంలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో దళితబంధు పథకంలో పాడిపశువుల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

పశువుల పంపిణీకి మరింత జాప్యం

పలు రాషా్ట్రల్లో ఉధృతంగా లంపిస్కిన వ్యాధి

పశువుల రవాణాపై ఇంకా తొలగని ఆంక్షలు

యూనిట్లకోసం ఎదురు చూస్తున్న దళితబంధు లబ్ధిదారులు

ఖమ్మం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దళితబంధు పథకం కింద గేదెలు, ఆవులు, పశువులు పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. లంపిస్కిన(ముద్దచర్మ)వ్యాధి కారణంగా పశువుల రవాణాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆంక్షలు సడలించకపోవడతో పశువుల రవాణా ఇతర రాష్ట్రాలనుంచి జరగడంలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో దళితబంధు పథకంలో పాడిపశువుల పంపిణీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే లబ్ధిదారుల అకౌంట్‌లోకి మాత్రం దళితబందు సొమ్ములు జమచేశారు. పశువుల రవాణాపై ఆంక్షలు తొలిగితేనే దళితబంధు కింద పశులు కొనుగోలు, రవాణకు అవకాశం కలుగుతుంది. చలికాలం ప్రారంభం కావడంతో ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వ్యాధి తీవ్రత మరింత పెరుగుతున్నందున గేదెలు, ఆవులు కొనుగోలుకు సాధ్యం కావడం లేదు. మరోవైపు గేదెలు, ఆవుల వ్యాపారం చేసే దళారులు మాత్రం లబ్ధిదారుల వద్దకు వెళ్లి పథకం ఆగిపోతుందని, త్వరగా గేదెలు, ఆవులు కొనుగోలు చేసుకోవాలని ప్రచారం సాగిస్తుండడంతో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్సతో పాటు ఎస్సీ కార్పొరేషన ఈడీ కార్యాలయం వద్ద లబ్దిదారులు బారులుదీరుతున్నారు.

పశువుల రవాణాతో లంపిస్కిన వ్యాప్తి

దళితబంధు లబ్ధిదారులకు స్వరాష్ట్రంలోని గేదెలు కాకుండా అధిక పాల దిగుబడినిచ్చే ఇతర రాషా్ట్రల గేదెలను కొనుగోలు చేయాలని నిబంధనల్లో సూచించారు. ప్రధానంగా హర్యాన, పంజాబ్‌, తమిళనాడు, రాజస్థాన, ఉత్తరప్రదేశ, గుజరాత తదితర రాష్ట్రాలనుంచి గెదేలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే ఆయా రాష్ట్రాలలోపాటు మనరాష్ట్రంలోనూ పలుచోట్ల లంపిస్కిన వ్యాధి వ్యాప్తిలో ఉంది. దాంతో పశువుల రవాణా కేవలం రాష్ట్ర పరధిలోనే జరగాలి తప్ప పొరుగు రాషా్ట్రలకు జరగొద్దని నిషేధం విధించారు. దాంతో ఇతర రాషా్ట్రల నుంచి పశువులను తీసుకొచ్చేందుకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇదిలా ఉండంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దళితబంధు లబ్ధిదారుల అకౌంట్లలో రూ.10లక్షల వరకు జమచేసింది. దాంతో లబ్ధిదారులు షెడ్లు కూడా నిర్మించుకున్నారు. గేదెలకు అవసరమైన పశుగ్రాసాన్ని కూడా పెంచారు. పశుగ్రాసం ముదిరిపోవడంతో తొలిగించి మళ్లీ సాగుచేస్తున్నారు. నియోజకవర్గానికి వందమంది లబ్ధిదారులను గుర్తించి రూ.48కోట్లతో 483మందికి ఆయా యూనిట్లు పంపిణీ చేశారు. చింతకాని మండలంలో గేదెలు, ఆవులు, ఇతర యూనిట్లు పంపిణీ అధికంగా సాగుతోంది. 3,444 యూనిట్లకుగాను రూ.346కోట్లు నిధుల మంజూరయ్యాయి. ఈ నిధులన్నీ లబ్ధిదారుల అకౌంట్లలో జమకాగా, చింతకాని మండలంలో యూనిట్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 600 గేదెలు, పశువుల, డెయిరీ యూనిట్లు మంజూరుకాగా ఇప్పటికే చింతకాని మండలంలో గతంలో 101 యూనిట్లు పంపిణీ చేశారు. ఇతర నియోజకవర్గాల్లో 57యూనిట్లు పంపిణీచేశారు. మిగిలిన 471యూనిట్లు లంపిస్కిన వ్యాధికారణగా ఆవులు, గేదెలు పంపిణీ ఆగిపోయింది. ఈ యూనిట్లకు ఇప్పటికే షెడ్లు నిర్మించి గేదెల పెంపకం కోసం పచ్చిగడ్డి పెంపకాన్ని కూడా చేపట్టారు. ఒక్కో యూనిట్‌కు రూ.10లక్షలు మంజూరు కాగా మొదటి విడత నాలుగు ముర్రా జాతి గేదెలు, రెండో విడత మరో నాలుగు ముర్రాజాతి గేదెలు మొత్తం ఎనిమిది గేదెలు పంపిణీ చేయాల్సి ఉంది మరికొందరు లబ్ధిదారులకు జెర్సీ ఆవులను కూడా పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లంపిస్కిన వ్యాధి తగ్గుముఖం పట్టి పశువుల రవాణాపై ఆంక్షలు తొలిగితేనే దళితబంధు లబ్ధిదారులకు పాడిపశువులు పంపిణీ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-30T01:46:11+05:30 IST