TS News: పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం..

ABN , First Publish Date - 2022-11-24T12:54:52+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): జిల్లాలో పెట్రోల్ (Petrol) బంకుల్లో మోసాలు బయటపడుతున్నాయి.

TS News: పెట్రోల్ బంక్‌లో ఘరానా మోసం..

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem): జిల్లాలో పెట్రోల్ (Petrol) బంకుల్లో మోసాలు బయటపడుతున్నాయి. కొత్తగూడెంలోని పోస్టాపీస్ (Post office) దగ్గరలో ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) బంకు

లో పెట్రోల్ కొట్టించిన ద్విచక్రవాహనదారుడికి ఇదే అనుభవం ఎదురైంది. బంకులో పెట్రోల్ కొట్టిస్తే ఇంటికి వెళ్లిన తర్వాత ఆ బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో ఏమైందని మెకానిక్ వద్దకు తీసుకువెళ్లగా పెట్రోల్‌లో నీళ్లు కలిసాయని తేలింది. ఇదే విషయాన్ని బంకు యాజమాన్యాన్ని అడిగిన బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. వంద వాహనాల్లో ఏదో ఒక దానికి ఇలా అవుతుందని చెప్పారు. గత నెలలో కూడా తనకు ఇదే సమస్య వచ్చిందని బాధితుడు వాపోయాడు.

పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. తనలాగే చాలా మంది బండ్లు పాడై ఇబ్బందులకు గురౌతుంటరాని అన్నారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు.

Updated Date - 2022-11-24T12:54:56+05:30 IST