‘తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక NTR’
ABN , First Publish Date - 2022-05-28T13:59:36+05:30 IST
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఖమ్మం: తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్(NTR) అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageshwar Rao) అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగు దేశం పార్టీ స్థాపించి దేశ రాజకీయాల్లో తెలుగు వారి సత్తా చాటిన రాజకీయ యోధుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కెనడాలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న తెలుగు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ చరిత్ర నిలిచిపోతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.