13వేల కుటుంబాలకు వరద సాయం

ABN , First Publish Date - 2022-08-04T07:27:24+05:30 IST

13వేల కుటుంబాలకు వరద సాయం

13వేల కుటుంబాలకు వరద సాయం

బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమ

భద్రాచలం, ఆగస్టు 3: గోదావరి వరదలవల్ల భద్రాద్రి జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు. మొత్తం 16,044  కుటుంబాలు గోదావర వరద ముంపునకు గురికాగా బుధవారం వరకు 13వేల కుటుంబాలకు నగదు బదిలీ చేసినట్లు వివరించారు. మిగిలిన కుటుంబాలకు గురువారం వరకు పరిహారం వారి  ఖాతాల్లో జమ చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-04T07:27:24+05:30 IST