తిరంగా..గర్వంగా

ABN , First Publish Date - 2022-09-18T04:55:28+05:30 IST

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి.

తిరంగా..గర్వంగా
చింతకానిలో సమరయోధులను సన్మానిస్తున్న సర్పంచ్‌

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవం

జాతీయ జెండాలు ఎగరేసి అమరులకు నివాళులు

నెట్‌వర్క్‌: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాల్లో ఘనంగా జరిగాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వారి క్యాంపు కార్యాలయాల్లో జెండాలు ఎగరేశారు. సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులుర్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీల కార్యాలయాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలు ఎగరేసి, నిజాంనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. వారి చేసిన త్యాగాలను నెమరేసుకున్నారు.

Read more