వేట కోసం విద్యుత మాటు

ABN , First Publish Date - 2022-12-07T00:33:56+05:30 IST

అడవుల్లో దోమల తీవ్రతతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి అడుగులు వేస్తాయి. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు లేక పోవటంతో ఏప్రిల్‌ నుంచి మే నెలలో జంతువులు అడవీ విడిచి మైదానంలోకి వస్తాయి. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన వన్యప్రాణులను వేటాడటం కోసం ప్రత్యేకంగా వేటగాళ్ల బృందాలు ఏర్పడతారు. వేటగాళ్లు ఐదేళ్లుగా సంప్రదాయ వేట విధానాలను వీడి ఆధునిక విధానంలో జంతువులను మట్టుపెడుతున్నా

 వేట కోసం విద్యుత మాటు

అడవుల్లో రెచ్చిపోతున్న వేటగాళ్లు

విద్యుత, అటవీశాఖ ఉద్యోగులకు మాంసంలో వాటాలు?

రెండు నెలల్లో రెండు సార్లు పట్టుబడిన కరెంటు తీగలు

అడ్డొచ్చారని అధికారి బైక్‌కు నిప్పు

ప్రాఽథమిక విచారణలో పలు విషయాలు వెలుగులోకి

ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబరు 6: అడవుల్లో దోమల తీవ్రతతో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి అడుగులు వేస్తాయి. వేసవిలో అటవీ ప్రాంతంలో నీరు లేక పోవటంతో ఏప్రిల్‌ నుంచి మే నెలలో జంతువులు అడవీ విడిచి మైదానంలోకి వస్తాయి. ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన వన్యప్రాణులను వేటాడటం కోసం ప్రత్యేకంగా వేటగాళ్ల బృందాలు ఏర్పడతారు. వేటగాళ్లు ఐదేళ్లుగా సంప్రదాయ వేట విధానాలను వీడి ఆధునిక విధానంలో జంతువులను మట్టుపెడుతున్నారు. అటవీ ప్రాంతంలో విద్యుత తీగలను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో విద్యుత తీగలకు సమీపంలోని విద్యుత ట్రాన్సఫార్మర్‌ ద్వారా విద్యుత సరఫరా అందించి వన్యప్రాణులను చంపుతున్నారు. గతంలో బురధరాఘవపురంలో చిరుతపులి, అడవీ దున్నలు, ఇతర జంతువులను వేటాడటంతో అటవీశాఖ అధికారులు కేసులు నమోదుచేశారు. ఈ సంవత్సరం సింగరేణి మండలంలో కూడా వేటగాళ్లు ఏర్పాటు చేసిన అడవీ దున్న విద్యుదాఘాతంతో మృత్యువాతపడింది. అయితే వన్యప్రాణుల చట్టం మేరకు వేటగాళ్లను గుర్తించి వారిపై నానబెయిల్‌బుల్‌ కేసులు నమోదు చేయాలి. కాని గత ఐదేళ్లలో చిరతపులులు మరణించిన ఆ స్థాయిలో అటవీశాఖ అధికారులు కేసులు మాత్రం నమోదు చేయకపోవటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యుత తీగలతో వన్యప్రాణుల వేట వేగం పెరిగింది.

రెండు నెలల్లో రెండు సార్లు విద్యుత తీగలు పట్టుబడి

బ్రహ్మాలకుంట అటవీ ప్రాంతంలో గత రెండు నెలల కాలంలో అటవీ అధికారులు రెండు సార్లు విద్యుత బైండింగ్‌ వైర్లును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల వేటలో వేటగాళ్ల బృందాలకు ఇటు అటవీశాఖలోని గ్రామ స్థాయి ఉద్యోగులు, విద్యుత శాఖలోని ఉద్యోగులు సహకరిస్తారని, వేటలో జంతువులు దొరికితే వారికి మాంసంలో వాటాలు వెళ్తాయనేది బహిరంగ రహస్యం. రెండు సార్లు విద్యుత బైండింగ్‌ తీగలు దొరికిన అటవీశాఖ అధికారులు సరైన కేసులు నమోదు చేయలేదని విమర్శలు ఉన్నాయి. సాధారణంగా వేట బృందాలు సాయంత్రం 4.30 గంటల నుంచి 6గంటల వరకు విద్యుత తీగలను ఏర్పాటు చేస్తారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత తిరిగి ఆ ప్రాంతానికి వెళ్లి సమీపంలోనే ఉన్న ముందుగానే గుర్తించిన విద్యుత ట్రాన్సఫార్మర్‌లకు విద్యుత అనుసందానం చేసి ఇంటికి వస్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు విద్యుత తీగలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళతారు.

బయపెట్టేందుకే వాహనానికి నిప్పు

గతంలో రెండుసార్లు అటవీశాఖ అధికారులు వేటగాళ్ల బృందాల విద్యుత తీగలను తీసుకేళ్లటంతో అటవీశాఖ అధికారులను బయపెట్టేం దుకే బ్రహ్మాలకుంటలో ఎప్‌ఎస్‌వో ద్వీ చక్రవాహనానికి నిప్పు పెట్టి ఉంటా రని అటవీశాఖ అధికారులు ప్రాథమిక విచారణలో తెలినట్లు తెలుస్తోంది. శనివారం బ్రహ్మాలకుంటలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన డీఎప్వో సిద్ధార్థవిక్రమ్‌సింగ్‌, ఏసీపీ వెంకటేశ్వరరావు, ఎఫ్‌డీవో మంజుల, పోలీసు, అటవీశాఖ అధికారులు ప్రాదమిక విచారణలో పలు విషయాలు వెలుగు లోకి వచ్చినట్లు తెలుస్తోంది. బైక్‌ను కాల్చివేసిన రోజు ద్వి చక్రవాహనంపై వచ్చిన అటవీశాఖ అధికారులు వాహనం పక్కకు పెట్టి అడవి లో నడుచుకుంటూ వెళ్లి వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత తీగలు కర్రలను తొలగిస్తున్న సమయంలోనే ద్వి చక్రవాహనం కాలిపోయినట్లు అటవీ, పోలీసుశాఖల అధికారులు ప్రాథమికం గా గుర్తించారు. దీనిని బట్టి వేటగాళ్లు అటవీశాఖ అధికారులను చూసి వారి ఆత్మస్థైర్యం దెబ్బతీయ టానికే ఇటువంటి ఘాతకానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికా రులు అంచనా వేస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సెల్‌పోన సిగ్నల్స్‌ ఆధారంగా విచారణ ప్రారంబించారు. ఏదీ ఏమైనా అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్య జరిగి పది రోజుల పూర్తి కాకుండానే బ్రహ్మలకుంట సంఘటన జరగటం అటవీశాఖలో అధికారులు, ఉద్యోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. శాఖ పరంగా జిల్లా స్థాయిలోని అధికారులు సరైన మద్దతు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అటవీశాఖ ఉద్యోగులు భయపడాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T00:33:58+05:30 IST