ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2022-08-04T07:21:32+05:30 IST

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా ఉండండి

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. సిద్ధంగా ఉండండి
నేలకొండపల్లిలో స్థానికులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి తుమ్మల

పార్టీ కోసం శక్తివంచనలేకుండా శ్రమించాలి

నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి తుమ్మల

నేలకొండపల్లి, ఆగస్టు 3: ఎన్నికల ఎప్పుడైనా రావొచ్చని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలకు సూచించారు. బుధవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా నేలకొండపల్లిలోని ముత్తినేని వీరయ్య నివాసంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ‘ఎన్నికలు ఎప్పుడొస్తాయ్‌.. సార్‌’ అని కార్యకర్తలు ప్రశ్నించగా స్పందించిన తుమ్మ ల ఎన్నికల పిడుగు ఎప్పుడైనా పడొచ్చని, గతంలోలా కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, పార్టీ కోసం పని చేయాలని సూచించారు. గతంలో తాను పూర్తిగా నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి పెట్టానని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో 30ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని రెండేళ్లలో చేశాననిగుర్తు చేశారు. తిరిగి పాలేరు నుంచే పోటీ చేయాలని తమ ఆకాంక్ష అని నాయకులు, కార్యకర్తలు పేర్కొనగా.. తాను పాలేరుపై పూర్తి దృష్టి పెట్టానని, గతంలో జరిగిన తప్పులు జరుగకుండా చూడాలన్నారు. పాలేరులో జరిగిన అభివృద్ధితో  భూముల రేట్లు బాగా పెరిగాయని, అది మీరు చేసిన అభివృద్ధి పుణ్యమేనని కార్యకర్తలు తుమ్మలతో అనగా పార్టీ కోసం కార్యకర్తలు శక్తివంచనలేకుండా శ్రమించాలని, తాను అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. గతంలో పూర్తిగా అభివృద్దిపైనే దృష్టి సారించటంతో కార్యకర్తలకు సమయమివ్వ లేక పోయానన్నారు. కార్యక్రమంలో నాచేపల్లికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటుగా తలశీల రాధాకృష్ణమూర్తి, కొర్లకుంట నాగేశ్వరరావు, చవలం వెంకటేశ్వరరావు, యడవల్లి సైదులు, గుడిపాటి ముక్కంటి, పొన్నగాని రాంభాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T07:21:32+05:30 IST