రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-08-05T03:55:15+05:30 IST

మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు.

రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు

ఎర్రుపాలెం, ఆగస్టు4: మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. వారు మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్‌ పార్టీయే అని వెన్నుపోటు పొడిచే నాయకులు పార్టీకి అవసరం లేదని, తెలిపారు. కార్యక్రమంలో మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు నండ్రు జనార్ధన్‌రావు, బాబూరావు, నాగేశ్వరరావు, అనిల్‌కుమార్‌, రాజీవ్‌గాంధీ, ప్రసాద్‌, ప్రేమ్‌, బాలరాజు, స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T03:55:15+05:30 IST