డ్రోన్‌ కెమెరాతో అర్బన్‌ పార్క్‌ పర్యవేక్షణ

ABN , First Publish Date - 2022-10-08T04:28:25+05:30 IST

ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచుతున్న నీలాద్రి అర్బన్‌ పార్క్‌ను డ్రోన్‌ కెమెరా సహాయంతో పర్యవేక్షణ చేయనున్నట్లు రేంజర్‌ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు.

డ్రోన్‌ కెమెరాతో అర్బన్‌ పార్క్‌ పర్యవేక్షణ
డ్రోన్‌ కెమెరాను ప్రారంభిస్తున్న రేంజర్‌ వెంకటేశ్వర్లు

సత్తుపల్లి, అక్టోబర్‌ 7: ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచుతున్న నీలాద్రి అర్బన్‌ పార్క్‌ను డ్రోన్‌ కెమెరా సహాయంతో పర్యవేక్షణ చేయనున్నట్లు రేంజర్‌ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పార్క్‌ ఎదుట డ్రోన్‌ కెమెరాను ఆయన ప్రారంభించారు. పార్క్‌కు హాజరయ్యే వారు అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వారిని సులువుగా గుర్తించడం, వన్యప్రాణుల సంరక్షణార్ధం డ్రోన్‌ కెమెరాను వాడుతున్నట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా అసాంఘీక కార్యకలాపాలు పార్క్‌లో తావులేదని, అడవులను కాపాడటం మన బాధ్యతను పర్యావరణ పర్యవేక్షించి జీవవైవిద్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-10-08T04:28:25+05:30 IST