ప్రభుత్వాలు వేస్తున్న ఎంగిలిమెతుకులకు ఆశపడొద్దు

ABN , First Publish Date - 2022-12-16T01:34:45+05:30 IST

ప్రభుత్వాలు వేస్తున్న ఎంగిలి మెతుకులకు ప్రజలు ఆశపడొద్దని, పేదలను బిచ్చగాళ్లుగా చూస్తున్నాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.విజయేందర్‌రావు, ఉపాధ్యాక్షుడు డాక్టర్‌ ఎస్‌.జతినకుమార్‌ విమర్శించారు.

ప్రభుత్వాలు వేస్తున్న ఎంగిలిమెతుకులకు ఆశపడొద్దు
మహాసభలో అభివాదం చేస్తున్న సంఘం నాయకులు

పేదలను బిచ్చగాళ్లుగా చూస్తున్న రాజకీయనేతలు

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయేందర్‌రావు

ఖమ్మంలో గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా ఆరో మహాసభ.. హాజరైన నేతలు

ఖమ్మంసంక్షేమవిభాగం, డిసెంబరు 15: ప్రభుత్వాలు వేస్తున్న ఎంగిలి మెతుకులకు ప్రజలు ఆశపడొద్దని, పేదలను బిచ్చగాళ్లుగా చూస్తున్నాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.విజయేందర్‌రావు, ఉపాధ్యాక్షుడు డాక్టర్‌ ఎస్‌.జతినకుమార్‌ విమర్శించారు. గురువారం ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ పేదల సంఘం ఆరో ఉమ్మడి జిల్లా మహాసభలో వారు మాట్లాడారు. 1977నుంచి 1980వరకు ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా అనేక భూ పోరాటాలు చేశామని గుర్తుచేశారు. 6వేల ఎకరాల పోడు భూములు, 2వేలఎకరాల సీలింగ్‌ భూములు పంపి ణీ చేయించామన్నారు. దమ్మపేట సమీప మండలాల పరిధిలోని 60 గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అటవీశాఖ అధికారులకు గిరిజనులకు మ ధ్య ప్రభుత్వాలే చిచ్చుపెట్టి పబ్బం గడుపుకొంటున్నాయని ఆరోపించారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పడిగ యర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోలెబొయిన ముత్తయ్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా కార్యదర్శి బాణాల లక్ష్మణాచారి, నాయకులు పాల్గొన్నారు.

పాల్వంచలో స్వల్ప భూప్రకంపన

పాల్వంచ టౌన, డిసెంబరు 15: పాల్వంచ పట్టణ పరిధిలో గురువారం మధ్యాహ్నం భూమి స్వల్పంగా కంపించింది. మధ్యాహ్నం 2:13గంటల సమయంలో రెండు సెకన్లపాటు ఈ ప్రకంపనలు రావడం, శబ్ధాలు రావడంతో పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. రిక్టర్‌ స్కేల్‌పై భూ కంపన తీవ్రత 3.2గా నమోదైనట్టు తెలుస్తుండగా.. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated Date - 2022-12-16T01:34:46+05:30 IST