అభివృద్ధిని అడ్డుకోవద్దు: ఎమ్మెల్యే సండ్ర

ABN , First Publish Date - 2022-03-05T05:38:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల అందరికి ప్రయోజనం కలుగుతుందని, రాజకీయ కక్షలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హితవు పలికారు.

అభివృద్ధిని అడ్డుకోవద్దు: ఎమ్మెల్యే సండ్ర

తల్లాడ మార్చి 4: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్ల అందరికి ప్రయోజనం కలుగుతుందని, రాజకీయ కక్షలతో అభివృద్ధిని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హితవు పలికారు. శుక్రవారం తల్లాడ మండలం మల్సూర్‌తండా, గొల్లగూడెం, పినపాక గ్రామాల్లో సీసీ రోడ్లను, రైతువేదిక, డంపింగ్‌యార్డు, పల్లెప్రకృతివనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలని, ముగిసిన అనంతరం అందరూ ఒక్కటేనన్నారు. తాను నిరంతరం సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్రంలోనే రికార్డుస్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చేనెల నుంచి సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజల కోసం మరో రెండు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. 

ఎమ్మెల్యేకు ఘనస్వాగతం 

తల్లాడ మండలంలోని మూడు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెంకటవీరయ్యకు ఘనస్వాగతం లభించింది. భారీ సంఖ్యలో వాహనాలతో తల్లాడ నుంచి మల్సూర్‌తండా, గొల్లగూడెం, పినపాక గ్రామాల వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నలమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఎం.విజయనిర్మల, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సొసైటీ చైర్మన్లు రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, అయిలూరి ప్రదీ్‌పరెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్‌లాల్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ దూపాటి భద్రరాజు, సర్పంచ్‌లు మాలోతు కల్యాణి, నారపోగు వెంకట్‌, తేళ్లపుట్ట స్వరాజ్యం, శీలం కోటిరెడ్డి, తూము శ్రీనివాసరావు, ఎంపీటీసీలు బాణోతు మోహన్‌, తేళ్లపుట్ట మాధవి, ఎంపీడీవో బి.రవీందర్‌రెడ్డి, ఎస్‌ఐ పి.సురేష్‌, టీఆర్‌ఎస్‌ జోన్‌ కన్వీనర్లు బద్దం కోటిరెడ్డి, కేతినేని చలపతిరావు, కోడూరి వీరకృష్ణ, వజ్రాల రామిరెడ్డి, మోదుగు ఆశీర్వాదం, మాలోతు లింగయ్య పాల్గొన్నారు.


చప్టా నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేయండి

 ఇంజనీరింగ్‌ అధికారులకు జడ్పీ సీఈవో అప్పారావు ఆదేశం

 డంపింగ్‌యార్డు స్థలం పరిశీలన 

వైరా, మార్చి 4: కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఆదేశాలతో శుక్రవారం జడ్పీ సీఈవో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ (ఇన్‌చార్జ్‌) అయిన వీవీ.అప్పారావు వైరా మునిసిపాలిటీకి కేటాయించిన డంపింగ్‌యార్డు స్థలాన్ని పరిశీలించారు. వైరా రిజర్వాయర్‌ అలుగుల ముందుభాగంలో తల్లాడ మండలం కొడవటిమెట్ట రెవెన్యూ పరిధిలో మూడెకరాల స్థలాన్ని వైరా మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు కోసం కేటాయిస్తూ ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో డంపింగ్‌యార్డు స్థల స్వరూపాన్ని అప్పారావు పరిశీలించారు. రిజర్వాయర్‌ అలుగుల్లోనుంచి చెత్తాచెదారంతో మునిసిపాలిటీ వాహనాలు డంపింగ్‌యార్డుకు వెళ్లాల్సి ఉంది. అయితే సరైన రహదారి సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. వర్షాకాలంలో రిజర్వాయర్‌కు వరదలు వచ్చి అలుగుల ద్వారా నీరు పొంగి ప్రవహించిన సమయంలో ఇప్పుడు ఏర్పాటుచేయనున్న డంపింగ్‌యార్డుకు వాహనాలు వెళ్లటానికి వీలులేదు. దాంతో అలుగుల ముందుభాగంలో రెండు చప్టాలు నిర్మించాల్సిన విషయం అప్పారావు దృష్టికి వచ్చింది. అలాగే డంపింగ్‌యార్డుకు అవసరమైన కాంపౌండ్‌వాల్‌ నిర్మాణం తదితర అంశాలను చర్చించారు. వెంటనే చప్టాలు ఇతర నిర్మాణాలకు సంబంధించి అవసరమైన నిధులకుగానూ ప్రతిపాదనలు తయారుచేయాలని మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇంకా పలు సమస్యల గురించి పరిశీలించారు. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, కమిషనర్‌ ఎన్‌.వెంకటపతిరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T05:38:08+05:30 IST