వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-06-08T05:26:01+05:30 IST

వర్షాకాలం సమీపిస్తుండడంతో సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయానందస్వామి తెలిపారు.

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో దయానందస్వామి

డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయానందస్వామి 

జూలూరుపాడు, జూన్‌7: వర్షాకాలం సమీపిస్తుండడంతో సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ దయానందస్వామి తెలిపారు. మంగళవారం జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిని ఆయ న సందర్శించారు. రికార్డులు, రిజిస్ట్రర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎ న్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అసంక్రమిత వ్యాధిగ్రస్థులు, రక్త హీనత కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రక్త హీనత కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని ఫ్రైడే - డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. సమావేశంలో వైద్యాధికారి శ్రీధర్‌, హెల్త్‌ సూపర్‌ వైజర్లు సుభద్ర, రాధిక, హెల్త్‌ అసిస్టెంట్‌ కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T05:26:01+05:30 IST